బాలీవుడ్ నటి నటాషాతో హార్థిక్ పాండ్య నిశ్చితార్ధం

బాలీవుడ్ నటి నటాషాతో హార్థిక్ పాండ్య నిశ్చితార్ధం
x
Hardik Pandya ,Natasa Stankovic.
Highlights

భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నిశ్చితార్థం చేసుకున్నాడు.

భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నిశ్చితార్థం చేసుకున్నాడు. గత కొంతకాలంగా సెర్బియా మోడల్‌ నటాషా స్టాన్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య సంబంధంపై తాజాగా హార్దిక్ పాండ్యా స్పందించాడు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో పాండ్యా ఒక పోస్టు పెట్టాడు. అందులో నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ హెచ్ పీ లవ్స్ నాట్స్ అని రాసిన కేక్‌ను కట్ చేశారు. ఇద్దరం నిశ్చితార్థం చేసుకున్నామని అభిమానులకు షేర్ చేశారు.

సముద్రంల ఓహ్యాచ్ లో ప్రయాణిస్తూ తన ప్రియురాలికి ఉగరం తొడిగాడు. ఇన్ స్టాలో మైతేరా, తు మేరి జాన్, సారా హిందుస్థాన్ .. #ఎంగేజ్‌డ్ అని పాండ్య పోస్ట్ జత చేశాడు. నటాషా కూడా పాండ్యకు ఉంగరం తొడిగింది. వీరి జంటను భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి ధోని సతీమణి సాక్షిధోని, జాడేజా, సోనాల్ చౌహన్, శ్రేయస్ అయ్యార్, కుల్ దీప్ యాదవ్ పలువురు అభినందనలు తెలిపారు.

గురించి హార్దిక్ పాండ్యా చేసిన మొదటి కామెంట్ ఇది కావడం విశేషం. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వార్తలు నెట్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా పాండ్యా పరిచయం చేశాడు. ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్‌ గర్ల్‌గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్‌ ఖాన్‌, అనుష్క నటించిన జీరో అనే సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది. బిగ్ బాస్ హీందీలో 8వ సీజన్ లో ఆమె చేసింది.


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Forever yes 🥰💍❤️ @hardikpandya93

🎀Nataša Stanković🎀 (@natasastankovic__) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది



Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged

Hardik Pandya (@hardikpandya93) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

Show Full Article
Print Article
Next Story
More Stories