Harbhajan Singh: అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌సింగ్ గుడ్‌బై

Harbhajan Singh: *23 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన హర్భజన్‌సింగ్.. *తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన భజ్జీ

Sandeep Eggoju
Updated on: 24 Dec 2021 3:27 PM IST
Harbhajan Singh Retirement From International Cricket | Sports Online News
X

అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌సింగ్ గుడ్‌బై

Harbhajan Singh: టీమిండియా లెజండరీ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్‌సింగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 23 ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లకు భారత్‌ నుంచి ప్రతినిధ్యం వహించిన బజ్జీ.. తాజాగా, అన్ని ఫర్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 ఏళ్ల కెరీర్‌లో తనకు సహకరిస్తూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ చెప్పాడు. భజ్జీ మొత్తంగా 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. 711 వికెట్లు పడగొట్టాడు.

రెండు టెస్టు సెంచరీలు కూడా నమోదు చేసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో చెన్నై, ముంబై, కోల్‌కతా తరఫున భజ్జీ ప్రాతినిధ్యం వహించాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story