దిశ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ అత్యాచార నిందితులన్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
దిశ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ అత్యాచార నిందితులన్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోషాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. అందులో భాగంగా భారత జట్టు మాజీ క్రికెటర్ వెటరన్ స్పీన్నర్ హర్భజన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్ కౌంటర్ చేయడంపై భజ్జీ హర్షం వ్యక్తం చేశారు. మహిళలపై ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండాలంటే ఎన్ కౌంటర్ సరైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తెలంగాణ పోలీసులను భజ్జీ అభినందించారు. ఈ మేరకు తన వ్యక్తి గత ట్విటర్ లో ట్వీట్ చేశారు. వెల్ డన్ తెలంగాణ సీఎం, పోలీస్ మీరు చేసిన పని అభినందనీయమే. భవిష్యత్తులో మరోసారి ఎవరైనా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడాలంటే వణుకుపుడుతుందని ట్వీట్ చేశారు.
దిశ నిందితులను ఎన్ కౌంటర్ తర్వాత సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. 'సాహో సజ్జనార్, శభాష్ సజ్జనార్ అంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు.
Well done @TelanganaCMO and police for showing this is how it is done ✅ no one should dare doing something like this again in future #makeitsafeindia https://t.co/g8uDNiCCn6
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 6, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire