Harbhajan Singh: ఫైనల్లో జట్టు విజయం... ధోనీ ఒక్కడికే క్రెడిట్ ఎందుకు?

Harbhajan Singh: ధోనీ ఒక్కడివల్లే విజయం సాధించలేదనే అభిప్రాయం

Rama Rao
Updated on: 13 April 2022 1:16 PM IST
Harbhajan Comments on the Role of Players in World Cup Success
X

Harbhajan Singh: ఫైనల్లో జట్టు విజయం... ధోనీ ఒక్కడికే క్రెడిట్ ఎందుకు?

Harbhajan Singh: టీమిండియా ప్రపంచకప్ గెలిచి పదకొండేళ్లయిన తర్వాత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి కెప్టెన్ ధోనిపై హర్బజన్‌సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిస్తే ధోని ఒక్కడికే క్రెడిట్‌ ఎందుకని ప్రశ్నించారు. ప్రపంచకప్‌ ధోని గెలిస్తే మిగతా 10 మంది ప్లేయర్లు లస్సీ తాగడానికి వెళ్లారా? అంటూ హర్బజన్‌సింగ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టోర్నీలో గొప్పగా ఆడిన గంభీర్‌ ఏం చేసినట్టని హర్బజన్‌సింగ్‌ తన మనసులో మాట బయటపెట్టారు. ఆటగాళ్లు అందరూ రాణించినప్పుడే జట్టు విజయం సాధిస్తుందనే అభిప్రాయాన్ని హర్బజన్‌సింగ్‌ వ్యక్తంచేశారు. ప్రపంచకప్ గెలుపు జట్టు విజయంతప్ప ఒకరివల్లే గెలిచిందనేది హాస్యాస్పదమన్నారు. హర్బజన్‌సింగ్‌ వ్యాఖ్యలపై ధోని అభిమానులు సమాజిక మాధ్యమాల వేదికగా మండిపడుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story