ది వాల్ రాహుల్ ద్రవిడ్ సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువ‎

ది వాల్ రాహుల్ ద్రవిడ్ సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువ‎
x
Rahul dravid
Highlights

భారత క్రికెట్ చరిత్రలోనే రాహుల్ ద్రవిడ్ పేరు చెరిగిపోని ముద్ర వేశారు

భారత క్రికెట్ చరిత్రలోనే రాహుల్ ద్రవిడ్ పేరు చెరిగిపోని ముద్ర వేశారు. టీమిండియాకు 16 ఏళ్లపాటు సేవలందిన రాహుల్ ద్రవిడ్ ఎన్నో విజయాలను అందించాడు. ఇక టెస్టు్ల్లో అయితే పరాజయాలకు అడ్డుగొడగా నిలిచాడు. అందుకే భారత క్రికెట్ అభిమానులు ద్రవిడ్ ను ద వాల్, విస్టర్ డిపెండబుల్ అని పిలిచేవారు. ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నా ద్రవిడ్ తన 47వ పుట్టిన‌రోజును జరుపుకుంటున్నారు. ద్రవిడ్ పుట్టినరోజు సందర్భంగా క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు ద్రవిడ్ వీడ్కోలు పలికాడు. క్లాస్‌ ఆటతీరుతో టెస్టు మ్యాచ్‌ అయినా వన్డే మ్యాచ్ అయినా చక్కటి టైమింగ్ టైమింగ్‌ ద్రవిడ్‌ సొంతం. కచ్చితమైన షాట్లతో అభిమానులకు ఆకట్టుకునేవారు. తన 16 ఏళ్లు క్రికెట్ ప్రస్థానంలో ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశారు. క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన 6వ ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

అప్పటి వరకు 164 టెస్ట్ మ్యాచుల్లో 13,288 పరుగులు చేశారు. ఇందులో 36 శతకాలు 63 ఆర్థశతకాలు నమోదు చేశాడు. ఇక 344 వన్డేల్లో 12 సెంచరీలు తోపాటు 83 ఆర్థ సెంచరీలు చేసిన ద్రవిడ్ వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధసెంచరీలు చేసి ఆటగాడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. గంగూలీ తర్వాత 2003 నుంచి 2007 వరకు భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు.

టెస్టుల్లో టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు ఒకేసారి క్రికెట్ అరంగేట్రం చేశారు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్ లో గంగూలీ సెంచరీ చేయగా, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులు చేసిన ఆకట్టుకున్నాడు. భారత క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.

క్రీకెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా రాహుల్ ద్రవిడ్ భారత్ క్రికెట్ అండర్ 19 జట్టుకు కోచ్ గా సేవలందించాడు. అండర్ 19జట్టుకు ప్రపంచ కప్ రావడంతో కోచ్ గా తన వంతు పాత్ర పోషించారు. అంతేకాదు 2004లో ఐసీసీ ప్రకటించిన టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారత్ క్రికెటర్ ద్రావిడ్ ఒక్కరే. ప్రస్తుతం ఎన్సీఏ డైరక్టర్ గా ద్రవిడ్ కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా రాహుద్రవిడ్ కు హర్భజన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. నువ్వు స్ఫూర్తి, రోల్ మోడల్, లెజెండ్ అంటూ మాజీ ఆటగాడు కైఫ్ ద్రవిడ్ కు పట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories