పఠాన్‌ రిటైర్మెంట్‌పై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్‌ చాపెల్‌

పఠాన్‌ రిటైర్మెంట్‌పై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్‌ చాపెల్‌
x
Greg chappell, Irfan pathan File Phtot
Highlights

భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే

భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్‌పై భారత జట్టు మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసలు కురిపించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గ్రెగ్‌ చాపెల్‌ మీడియా సమావేశంలో ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్‌పై స్పందించాడు. ఇర్ఫాన్ పఠాన్ జట్టులో ముఖ్యమైన ఆటగాడని, అవసరమైన సమయంలో బౌలింగ్, బ్యాటింగ్ చేయగల సమర్థుడని కితాబిచ్చాడు.

అంతేకాకుండా పఠాన్‌కు ఏటువంటి స్వార్థం ఉండదని, ధైర్యవంతుడని ప్రశంసించాడు. పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో పఠాన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడని చాపెల్ గుర్తు చేశారు. రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేయగల సామర్థ్యం పఠాన్ ఉందని, బ్యాట్స్ మెన్ గంగారు పెట్టించగలడని ప్రశంసించాడు. పఠాన్‌ ఆట గాడితప్పడానికి చాపెల్ ప్రయోగాలే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. పఠాన్ ను ఆలౌరండర్ గా మార్చడానికి ఎక్కువ బ్యాటింగ్ ప్రాక్టిస్ చేయించేవాడని, అందుకే పఠాన్ బౌలింగ్ లయ తప్పిందని క్రీడా పండితులు విమర్శించారు. ఈ విషయాలను పఠాన్ తీవ్రంగా ఖండించాడు కూడా.. నా తప్పిదాలను కప్పిపుచ్చుడానికి చాపెల్ పై ఆరోపణలు చేస్తు్న్నారని వ్యాఖ్యానించాడు. మొదట్లోనే బౌలింగ్ వేసే అవకాశం మెనెజ్ మెంట్ ఇవ్వలేదని, పది ఓవర్ల తర్వాత బంతి ఇస్తే స్వింగ్ చేసే అవకాశం రాదని వ్యాఖ్యానించాడు.

ఇర్ఫాన్ పఠాన్ 19 ఏళ్ల వయస్సులోనే టీమిండియాలో స్థానం సంపాదించాడు. 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. కపిల్‌ దేవ్‌ బౌలింగ్‌ శైలితో అభిమానులు ఇర్ఫాన్‌ బౌలింగ్‌ను పోలుస్తారు. మూడు ఫార్మార్లలో కలిపి 306 వికెట్లు దక్కించుకున్నాడు. మొదట బౌలర్ గా అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా రాణిస్తూ ఆల్ రౌండర్ అవతారం ఎత్తాడు. వన్డేల్లో 120, 173 వికెట్లు తీసుకున్నాడు. 27 పరుగులకే ఐదు వికెట్ల తీసిన రికార్డు సాధించాడు. ఇక 29 టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ చూస్తే టెస్టుల్లో 1105 పరుగులు సాధించాడు. అందులో ఏడు అర్థశతకాలు, ఒక శతకం నమోదు చేశాడు. వన్డేల్లో 15,44 పరుగులు సాధించాడు. ఐదు అర్థ శతకాలు ఉన్నాయి.9 ఏళ్లపాటు టీమిండియాకు సేవలందించాడు. 2012లో శ్రీలంకపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. పఠాన్ ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories