India Vs England: టీం ఇండియాకు గుడ్‌న్యూస్ చెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం!

Good News for Team India in Indian Tour of  England 2021
x

టీం ఇండియా ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్)

Highlights

India Tour of England 2021: ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరే ముందు టీం ఇండియాకు శుభవార్త. ఎట్టకేలకు బీసీసీఐ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

India Tour of England 2021: ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరే ముందు టీం ఇండియాకు శుభవార్త అందింది. ఎట్టకేలకు బీసీసీఐ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇంగ్లాండ్ లోకి వచ్చే వారికి కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తుంది భ్రిటన్ ప్రభుత్వం. అయితే, టీం ఇండియాకు మాత్రం ఈ కఠిన రూల్స్ నుంచి సడలింపులు లభించడంతో పాటు ప్రయాణ రూల్స్‌ను రద్దు చేసి.. కొంత రిలీఫ్‌నిచ్చింది.

ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ మేరకు పలు దేశాలు భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నాయి. అలాగే ఇంగ్లాండ్ కూడా సొంత దేశం, ఐర్లాండ్‌ పౌరులను మినహా మరెవ్వరినీ దేశంలోకి రానివ్వడం లేదు. కాగా, ఇంగ్లాండ్‌ పర్యటన కోసం ఇండియా టీం 3 నెలలు అక్కడే ఉండాలి. మెన్స్ టీంతో పాటు మహిళల టీ కూడా ఒక టెస్టు, టీ20 సిరీసుల కోసం వెళ్లనుంది.

ఈమేరకు బీసీసీఐ.. బ్రిటన్ ప్రభుత్వంతో కొంత కాలంగా మంతనాలు చేస్తుంది. ఎట్టకేలకు బీసీసీఐ అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత్వం ఓకే చేసింది. టీం ఇండియా జూన్‌ 2న ఇంగ్లాండ్ కు బయల్దేరనుంది. జూన్‌18న న్యూజిలాండ్‌తో డబ్యూటీసీ ఫైనల్ లో తలపడనుంది. ఆ తర్వాత నెలరోజుల పాటు వార్మప్ మ్యాచ్‌లు ఆడి, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది.

టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా ఈ బుధవారం(మే 19) లోపు ముంబయికి చేరుకోవాలని బీసీసీఐ కోరింది. మే 24న బయో బుడగలోకి వెళ్తారు. ముంబయిలో ఉండే క్రికెటర్లు 24న నేరుగా బయో బుడగలోకి వెళ్లారు. సుదీర్ఘ పర్యటన, కఠినమైన బయో బుడగలో ఉండాలి. కాబట్టి ఆటగాళ్ల కుటుంబ సభ్యులకూ అవకాశం ఇవ్వనుంది బీసీసీఐ. క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులు కూడా ముంబయిలోని బయో బుడగలో క్వారంటైన్‌ ఉండాలి. క్రికెటర్లు, సిబ్బందికి కఠిన రూల్స్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. కాగా, ఆటగాళ్ల కుటుంబ సభ్యుల కోసమూ బీసీసీఐ మరోసారి మంతనాలు చేస్తోంది.

కాగా, ఎరికైనా ఈ లోపు పాజిటివ్ వస్తే మాత్రం ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లరని బీసీసీఐ ఇంతకుముందే హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories