Shubman Gill: శుభమన్ గిల్ కెప్టెన్సీ.. రోహిత్-విరాట్‌ల వారసత్వంపై కీలక వ్యాఖ్యలు!

Shubman Gill
x

Shubman Gill: శుభమన్ గిల్ కెప్టెన్సీ.. రోహిత్-విరాట్‌ల వారసత్వంపై కీలక వ్యాఖ్యలు!

Highlights

Shubman Gill: భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. యువ సంచలనం శుభమన్ గిల్ భారత టెస్ట్ జట్టుకు కొత్త సారథిగా నియమితులయ్యారు.

Shubman Gill: భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. యువ సంచలనం శుభమన్ గిల్ భారత టెస్ట్ జట్టుకు కొత్త సారథిగా నియమితులయ్యారు. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలోనే గిల్, టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నాయకత్వంపై తన మనసులోని మాటను బయటపెట్టారు. వారిద్దరి నుంచి తాను నేర్చుకున్న పాఠాలను, వారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో స్పష్టం చేశారు. భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో వచ్చిన గిల్, 37వ టెస్ట్ కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయారు.

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభమన్ గిల్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ కొత్త పాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. భారత టెస్ట్ కెప్టెన్‌గా శుభమన్ గిల్ ప్రస్థానం జూన్ 24న ఇంగ్లాండ్ పర్యటనతో ప్రారంభం కానుంది. కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భారత్‌కు ఇదే మొదటి సవాలు. ఈ సిరీస్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడతారు.

గెలుపు ఫార్ములాను అందించిన రోహిత్-విరాట్!

రోహిత్-విరాట్‌ల గురించి శుభమన్ గిల్ చెప్పిన అతి పెద్ద విషయం ఏమిటంటే.. వారు టీమిండియాకు ఒక 'బ్లూ ప్రింట్' (గెలుపు ప్రణాళిక) ను అందించారు. మ్యాచ్‌లు, సిరీస్‌లు ఎలా గెలవాలి, కష్ట సమయాల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను వారిద్దరూ జట్టుకు నేర్పించారని గిల్ ప్రశంసించారు.

ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌పై శుభమన్ గిల్ మాట్లాడుతూ.. "ఇలాంటి సిరీస్‌లు నాకు ఎప్పుడూ ఇష్టమైనవి. ఎందుకంటే ఇందులో అన్ని రకాల సవాళ్లు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా కూడా పోరాడాల్సి ఉంటుంది" అని పేర్కొన్నారు. గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories