Gautam Gambhir: ఓవర్ టెస్ట్ గెలిచిన తర్వాత గంభీర్ అన్న మాటకు ఎవరైనా ఫిదా కావాల్సిందే !

Gautam Gambhir: ఓవర్ టెస్ట్ గెలిచిన తర్వాత గంభీర్ అన్న మాటకు ఎవరైనా ఫిదా కావాల్సిందే !
x

Gautam Gambhir: ఓవర్ టెస్ట్ గెలిచిన తర్వాత గంభీర్ అన్న మాటకు ఎవరైనా ఫిదా కావాల్సిందే !

Highlights

Gautam Gambhir: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌పై అద్భుతమైన విజయం సాధించింది.

Gautam Gambhir: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌పై అద్భుతమైన విజయం సాధించింది. మ్యాచ్ ఓడిపోతుందనుకున్న దశలో టీమిండియా అనూహ్యంగా పుంజుకుని, కేవలం 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. ఇరు జట్లు ఎండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని పంచుకున్నాయి. ఈ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సిరీస్‌లో గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వచ్చినా, ఈ గెలుపు వాటికి గట్టి సమాధానం ఇచ్చింది.

ఈ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ తన సోషల్ మీడియాలో ఒక హృదయాన్ని హత్తుకునే పోస్ట్ పెట్టారు. "మేము కొన్నిసార్లు గెలుస్తాం... కొన్నిసార్లు ఓడిపోతాం... కానీ మేము ఎప్పుడూ లొంగిపోం. శభాష్ కుర్రాళ్లు" అని రాశారు. ఈ కామెంట్ టీమిండియా ఈ సిరీస్‌లో చూపించిన పోరాట పటిమకు అద్దం పడుతుంది. యువ కెప్టెన్ శుభమన్ గిల్ నాయకత్వంలో, గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా అనుభవం లేకున్నా తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని ఈ సిరీస్ నిరూపించింది.

ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలోనూ భారత జట్టు పోరాట పటిమను ప్రదర్శించింది. లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలిచినా, టీమిండియా బలంగా పుంజుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. లార్డ్స్‌లో కేవలం 22 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, టీమ్ స్ఫూర్తిని కోల్పోలేదు. మాంచెస్టర్‌లో ఏకంగా 311 పరుగుల వెనుకబడినప్పటికీ, మ్యాచ్‌ను డ్రాగా ముగించి, తమ పోరాటపటిమను చాటింది. ఓవల్‌లో ఇంగ్లండ్ గెలుపుకు కేవలం 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు, భారత్ వారిని 6 పరుగుల తేడాతో ఓడించి 'నెవర్ సరెండర్' అనే మాటను నిజం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories