అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు ... టీంఇండియా ప్లేయర్స్ గరంగరం!

అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు ... టీంఇండియా ప్లేయర్స్ గరంగరం!
x
Gautam Gambhir, Shahid Afridi(File photo)
Highlights

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి భారత ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటివల పర్యటించిన అఫ్రిది అక్కడ భారత్‌పై తనకున్న విద్వేషాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో భారత క్రికెటర్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు. దీనిపైన భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజీపే ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

" పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. అలాంటి దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా? అంటూ గంభీర్ ఫైర్ అయ్యాడు.

ఇక ఇదే విషయం పైన టీంఇండియా ఆటగాడు హర్బజన్ సింగ్ కూడా కూడా స్పందించాడు. అఫ్రిది తన హద్దులు దాటి మాట్లాడాడని, అతని వ్యాఖ్యలు చాలా బాధించాయన్నాడు. ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశాడు. ఇక యువరాజ్ సింగ్ స్పందిస్తూ .. దేశం కోసం ఆడిన బాధ్యతాయుతమైన భారతీయుడిగా నేను ఇలాంటి మాటలను ఎప్పటికీ అంగీకరించనని,తను మా సహాయం కోరినప్పుడు మేము ఏదీ ఆలోచించకుండా ముందుకు వచ్చాము. మానవత్వంతో స్పందించాం. కానీ అఫ్రిది ఏ మాత్రం మారలేదని యువీ పేర్కొన్నాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories