Top
logo

Kolkata Knight Riders: పవర్ ప్లే లో దుమ్ము దులిపేస్తాం: కేకేఆర్ ఓపెనర్ శుభమన్ గిల్

Game Plan in Power Play says Kolkata Knight Riders Opener Shubman Gill
X

శుభమన్ గిల్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Kolkata Knight Riders: "పవర్ ప్లే లో దుమ్ము దులిపేస్తామని" కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ శుభమన్ గిల్ అంటున్నాడు.

Kolkata Knight Riders: "పవర్ ప్లే లో దుమ్ము దులిపేస్తామని" కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ శుభమన్ గిల్ అంటున్నాడు. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్ లో.. ఏప్రిల్ 11న సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో కేకేఆర్ తన మొదటి మ్యాచ్ ని ఆడనుంది. మొదటి మ్యాచ్ నుంచే పవర్ ప్లేలో గేమ్ ప్లాన్ ఆరంభిస్తామంటున్నాడు ఈ యువ బ్యాట్స్ మెన్.

ఇప్పటి వరకు కోల్‌కతా తరఫున ఓపెనర్‌గా 14 మ్యాచ్‌లాడిన శుభమన్ గిల్ 117.96 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ, టీ20ల్లో దూకుడు లేదనే విమర్శలు వచ్చాయి. ఈ మేరకు.. ఈ సీజన్‌ లో గేమ్ ప్లాన్‌ని మార్చబోతున్నట్లు శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.

''గత సీజన్‌లో కేకేఆర్ కి ఏ మ్యాచ్‌లోనూ ఆశించిన స్థాయిలో పవర్‌ప్లేలో పరుగులు రాబట్టలేకపోయారు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌ భిన్నంగా ఉండబోతోంది. ఈ మేరకు ఇప్పటికే గేమ్ ప్లాన్ రెడీ చేసుకున్నామని, గత ఏడాదితో పోలిస్తే.. ఈ సారి మాత్రం పవర్‌ప్లేలో దంచి కొడతామని '' గిల్ స్పష్టం చేశాడు.

కాగా, శుభమన్ గిల్ తో ఓపెనింగ్ చేసేది ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. గత సీజన్ లో సునీల్ నరైన్.. సీజన్ మధ్యలో రాహుల్ త్రిపాఠి.. చివర్లో నితీశ్ రాణా ఓపెనర్లుగా ఆడారు. ఈ ముగ్గురూ అంచనాల్ని అందుకోలేకపోయారు. మరి ఓపెనింగ్ విషయంలో ఎవరని ఆడిస్తారో చూడాల్సిందే..

Web TitleGame Plan in Power Play says Kolkata Knight Riders Opener Shubman Gill
Next Story