IND vs NZ ODI : శార్ధూల్‌, కోహ్లీపై నెటిజన్ ట్రోల్స్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు

IND vs NZ ODI : శార్ధూల్‌, కోహ్లీపై నెటిజన్ ట్రోల్స్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు
x
India Team Trolls
Highlights

టీమిండియా ఆటగాళ్లపై నెటిజన్లు జోక్‌లు పేలుస్తున్నారు. రోహిత్ శర్మ, ధోనీ లేకపోతే వన్డేల్లో టీమిండియాకు ఆటతీరు దారుణంగా ఉంటుందని విమర్శలు చేస్తున్నారు.

నూజిలాండ్ పై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ సునాయాసంగా ఛేదించింది. దీంతో 47.1 ఓవర్లలోనే ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. కివీస్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌(80 పరుగులు,103 బంతుల్లో,9ఫోర్లు) టాప్ స్కోరర్‌కాగా మార్టిన్‌ గప్టిల్‌(46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించాడు. గ్రాండ్ హోమ్(58,28 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో కివీస్ అలవోకగా విజయం సాధించింది

తొలుత బ్యాటింగ్ ఓపెనర్‌ ఓపెనర్‌ పృథ్వీ షా (42 పరుగులు బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2)రాణించారు. శ్రేయాస్‌ అయ్యర్‌ (63 పరుగులు బంతుల్లో 62; ఫోర్లు 4), మనీష్‌ పాండే (48 బంతుల్లో 42; ఫోర్లు 2)తో మరోసారి సత్తాచాటాడు. రాహుల్‌ (112 పరుగులు, 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌)ల సెంచరీవృథా మిగిలింది. రెండు జట్ల మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకానుంది.

కాగా.. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లపై నెటిజన్లు జోక్‌లు పేలుస్తున్నారు. రోహిత్ శర్మ, ధోనీ లేకపోతే వన్డేల్లో టీమిండియాకు ఆటతీరు దారుణంగా ఉంటుందని విమర్శలు చేస్తున్నారు. కోహ్లీ నమ్మి బౌలింగ్ ఇస్తే కోహ్లీ నమ్మి కివీస్‌ని గెలిపించావ్‌ అంటూ ఠాకూర్‌పై అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడ్డ సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కివీస్ మ్యాచ్ లో రాహుల్ సెంచరీ చేశాడు. రెండు అంశాలను జోడిస్తూ.. ఢిల్లీలో రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్ ఖాతా తెరవకపోయిన ఒకటే.. టీమిండియా ఆటగాడు రాహుల్ సెంచరీ చేసిన, చేయకపోయినా ఒకటే అంటూ సెటైర్లు వేస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. కివీస్‌పై జరిగిన మూడు వన్డేల సిరీస్ వైట్‌వాష్ చేయించుకున్న సంగతి తెలిసిందే. 1989లో ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ విండీస్ చేతిలో 5-0తో ఓడిపోయింది. ఆ త్వర్వాత ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ రూపంలో దారుణ పరాభవం ఎదురుకాలేదు.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories