Top
logo

ఐపీఎల్‌ 2020 : కీలక ఆటగాళ్లను పక్కన పెట్టిన ఫ్రాంచైజీలు

IPL 2020
X
IPL 2020
Highlights

అన్ని జట్లు టైటిట్ గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఫ్రాంచైజీలు తమకు మరోవైపు అవసరంలేని ఆటగాళ్లను బదిలీ చేశాయి.

ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను పక్కనపెట్టాయి. . అన్ని జట్లు టైటిట్ గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఫ్రాంచైజీలు తమకు మరోవైపు అవసరంలేని ఆటగాళ్లను బదిలీ చేశాయి. కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడానికి చూస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న కొత్త ఆటగాళ్లను తీసుకుకోవడానికి భారీగా డబ్బు చెల్లించేందుకు సిద్దపడ్డ తున్నాయి. వచ్చే సీజన్‌ ట్రేడింగ్‌ విండో ముగిసింది. ఐపీఎల్‌ యాజమాన్యం ఏ జట్టు తమ వద్ద అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, బదిలీ చేసిన ఆటగాళ్ల జాబితా చూస్తే

ముంబయి ఇండియన్స్‌

జట్టులోని ఆటగాళ్ల విషయాని వస్తే రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగ, కృనాల్‌ పాండ్య, క్వింటన్‌ డికాక్‌, మిచెల్‌ మెక్‌లగన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌, ఇషాన్‌ కిషన్‌, ధవళ్‌ కుల్‌కర్ణి, అనుకుల్‌ రాయ్‌, ఆదిత్య తారె, జయంత్‌ యాదవ్‌ జట్టుతో ఉన్నారు.

గత సంవత్సరం టీమిండియా క్రికెటర్ యువరాజ్ ను ముంబై ఇండియన్స్ జట్టు తక్కువకు కొనుగోలు చేసింది. అయితే యువరాజ్ ను ముంబై ఇండియన్స్ వేలంలోకి వదిలింది. 2016 ఐపీఎల్ లో భీకర ఫోమ్ లో ఉన్న అతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ 16 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్లలో యువరజ్ రికార్డు నెలకొప్పాడు. తాజాగా యువరాజ్‌ను ముంబై జట్టుకూడా వేలానికి ఉంచింది. కోల్ కతాలో డిసెంబర్ 19న వేలం జరగనుంది. వీరిలో యువరాజ్ తోపాటు హెండ్రిక్స్, బెన్ కటింగ్ లాంటి కీలక ఆటగాల్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్య, బుమ్రా, చాహర్, పొలార్డ్, మలింగ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. యువరాజ్ సింగ్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

కింగ్స్‌ XI పంజాబ్‌

పంజాబ్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, కరుణ్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మహ్మద్‌ షమి, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, కృష్ణప్ప గౌతమ్‌, ముజీబ్‌ అర్‌ రెహ్మాన్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, దర్శన్‌ నల్కండె , అర్షదీప్‌ సింగ్‌, హర్దస్‌ విల్‌జోయిన్‌, మురుగన్‌ అశ్విన్‌, జే సుచిత్‌, కొనసాగుతారు. మిల్లర్‌, ఆండ్రూ టై, శామ్‌ కరణ్‌, మోజెస్‌ హెన్రిక్స్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అగ్నివేశ్‌ అయాచి,జట్టుకు దూరమవుతారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌

చెన్నై జట్టులో ఎంఎస్‌ ధోనీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, విధ్వంజకర ఇన్నింగ్స్ ఆడే వారు.. రవీంద్ర జడేజా, హర్భజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌,డ్వేన్‌ బ్రావో, కేదార్‌ జాదవ్‌, లుంగి ఎంగిడి, మోను కుమార్‌, మిచెల్‌ శాంట్నర్‌, ఎన్‌ జగదీశన్‌,కరణ్ శర్మ, ఇమ్రాన్‌ తాహిర్‌, కేఎం ఆసిఫ్‌ ఉన్నారు. ఇక వాళ్లలో డేవిడ్‌ విల్లే, మోహిత్‌ శర్మ, శామ్‌ బిల్లింగ్స్‌, స్కాట్‌ కగిలీన్‌,చైతన్య బిష్ణోయి, ధ్రువ్‌ షోరె, జట్టు నుంచి విడుదల చేసింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఫ్రాంచైజీ అయితే కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ ఖాన్‌, డేవిడ్‌ వార్నర్‌, మనీశ్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా, మహ్మద్‌ నబీ, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, విజయ్‌ శంకర్‌, జానీ బెయిర్‌స్టో, శ్రీవత్స్‌ గోస్వామి,బిల్లీ స్టాన్‌లేక్‌, బసిల్‌ థంపి, టీ నటరాజన్‌, ఖలీల్ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, షాబాజ్‌ నదీమ్‌ను ఆ జట్టు అట్టిపెట్టుకుంది. ఇక రిజీజ్ చేసిన వారని చూస్తే యూసఫ్‌ పఠాన్‌, రికీ భుయ్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, దీపక్‌ హుడా, మార్టిన్‌ గప్తిల్‌, ఉన్నారు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌, శివమ్‌ దూబె, పార్థివ్‌ పటేల్‌, యుజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, పవన్‌ నేగి, గురుకీరత్‌ మన్‌, దేవత్‌ పడిక్కల్‌, నవదీప్‌ సైనిలను జట్టుతో కొనసాగుతున్నారు. డేల్‌ స్టెయిన్‌, అక్షదీప్‌ నాథ్‌, నాథన్‌ కుల్టర్‌నైల్‌, మార్కస్‌ స్టొయినిస్‌, షిమ్రన్ హెట్‌మయర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మలింగ్‌ కుమార్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, ప్రయాస్‌ బర్మన్‌, కుల్వంత్‌ కేజ్రోలియా, హిమ్మత్‌ సింగ్‌,టిమ్‌ సౌథీను జట్టునుంచి విడుదల చేసింది.

దిల్లీ క్యాపిటల్స్‌

దిల్లీ క్యాపిటల్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్ ధావన్‌, అజింక్య రహానె ఇషాంత్‌ శర్మ, రవిచ్రందన్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రా, పృథ్వీషా, రిషభ్‌ పంత్‌, అవేశ్‌ ఖాన్‌, కీమో పాల్‌, అక్షర్‌ పటేల్‌, సందీప్‌ లమిచాన్‌, కగిసో రబాడ, హర్షల్‌ పటేల్‌ కొనసాగుతారు. బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్‌ సక్సేన, క్రిస్‌ మోరిస్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, మన్‌జ్యోత్‌ కల్రా, కొలిన్‌ మన్రో, నాథుసింగ్‌, అంకుష్‌ బేయాన్స్‌ జట్టుకు దూరం కానున్నారు.

రాజస్థాన్‌ రాయల్స్‌

స్టీవ్‌ స్మిత్‌, రియాన్‌ పరాగ్‌, శశాంక్‌ సింగ్‌, సంజు శాంసన్‌, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, మయాంక్‌ మర్కండే, రాహుల్‌ తెవాతియా, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మహిపాల్‌ లోమ్రర్‌, వరుణ్‌ అరోన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, మనన్‌ వోహ్రాలను రాజస్థాన్‌ నిలబెట్టుకుంది. ఇష్‌ సోది, శుభమ్‌ రంజన్‌, ప్రశాంత్‌ చోప్రా, ఆస్టన్‌ టర్నర్‌, ఒషానే థామస్‌, ఆర్యమన్‌ బిర్లా, జైదేవ్‌ ఉనద్కత్‌, రాహుల్‌ త్రిపాఠి, సుదేశన్‌ మిథున్‌ల స్టువర్ట్‌ బిన్నీ, లియామ్‌ లివింగ్‌స్టన్ జట్టు నుంచి దూరం కానున్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా జట్టు ఆటగాళ్ల జాబితా చూస్తే సునీల్‌ నరైన్‌, దినేశ్ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, నితీశ్‌ రాణా, సందీప్‌ వారియర్‌, శుభ్‌మన్‌ గిల్‌,శివమ్‌ మావి, సిద్దేశ్‌ లాడ్‌ లాకీ ఫెర్గూసన్‌, హ్యారీ గర్నీ, కమలేశ్‌ నాగర్‌కోటి జట్టులో ఉంటారు. కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ పియూష్‌ చావ్లా, రాబిన్‌ ఉతప్ప, , నిఖిల్‌ నాయక్‌, కేసీ కరియప్ప, క్రిస్‌ లిన్‌,జో డెన్లీ, యర్రా పృథ్వీరాజ్‌మాథ్యూ కెల్లీ, అన్రిచ్‌ నోర్జె, శ్రీకాంత్‌ ముంఢె జట్టు నుంచి వైదొలుగుతారు.

అన్ని జట్లు ఈ సీజన్ లో తమ అదృష్టా్న్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ వేలానికి ముందుగానే అన్ని జట్టు కొందరి ఆటగాళ్లను విడిచిపెట్టాయి. ఢిల్లీ ముంబయి కోల్ కతా లాంటి జట్లు ఆటగాళ్లను బదిలీ చేసుకున్నాయి.

Web TitleFull list of retained and released players by franchises
Next Story