logo
క్రీడలు

IPL 2022: ఐపీఎల్ 2022కి ఆటగాళ్లని రిటైన్ చేసుకున్న ఫ్రాంఛైజీలు

Full List of Players Retained by the 8 IPL Franchises Before IPL 2022 Auction
X

ఐపీఎల్ 2022 ప్లేయర్స్ లిస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

IPL 2022: బెంగళూరు ఫ్రాంఛైజీ ముగ్గురు ఆటగాళ్లని రిటైన్

IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముంగిట టోర్నీలోని పాత ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాని మంగళవారం రాత్రి ప్రకటించాయి. డిసెంబరు చివర్లో లేదా జనవరి ఆరంభంలో ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుండగా 8 ఫ్రాంఛైజీలకి గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునే వెసులబాటుని బీసీసీఐ కల్పించింది. అయితే ఇందులో నాలుగు ఫ్రాంఛైజీలు మాత్రమే నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకోగా మిగిలిన నాలుగు జట్లలో పంజాబ్ కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది.

ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయ్ ఫ్రాంచైజీలు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి తమ అభిమాన క్రికెట్ సూపర్ స్టార్‌లు పాత జట్లతోనే ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్ వంటి క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్ ప్లేయర్ల వేలం పూల్‌లోకి వెళ్లనున్నారు.


Web TitleFull List of Players Retained by the 8 IPL Franchises Before IPL 2022 Auction
Next Story