Vaibhav Suryavanshi: ప్రధానితో వైభవ్ భేటీ.. భారత క్రికెట్ భవిష్యత్తుపై అంచనాలు!

Vaibhav Suryavanshi
x

Vaibhav Suryavanshi: ప్రధానితో వైభవ్ భేటీ.. భారత క్రికెట్ భవిష్యత్తుపై అంచనాలు!

Highlights

Vaibhav Suryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Vaibhav Suryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పట్నా ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ సమావేశం వైభవ్‌కు ఇంగ్లండ్ టూర్‌కు ముందు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు. ఈ భేటీ గురించి స్వయంగా ప్రధాని మోడీ తన ఎక్స్ (X) హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. వైభవ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులను కూడా మోదీ కలిశారు.

మోడీ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ (X) హ్యాండిల్‌లో వైభవ్ సూర్యవంశితో జరిగిన సమావేశం గురించి ప్రస్తావించారు. పట్నా ఎయిర్‌పోర్టులో వారిద్దరూ కలుసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, వైభవ్ సూర్యవంశి క్రికెట్ నైపుణ్యాలను ఎంతగానో ప్రశంసించారు. "నువ్వు ఈ దేశం మొత్తానికి స్ఫూర్తి" అని మోదీ వైభవ్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రధాని మోదీ, వైభవ్ సూర్యవంశి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రశంసలు వైభవ్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు.



ఇంగ్లండ్ టూర్‌కు శుభాకాంక్షలు

వైభవ్ సూర్యవంశి త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జూన్ 24న ప్రారంభమయ్యే ఈ టూర్‌లో అతను భారత్ అండర్-19 జట్టులో భాగంగా ఉంటారు. ఈ ఇంగ్లండ్ పర్యటనలో, అలాగే భవిష్యత్తులో రాబోయే ఇతర టోర్నమెంట్లు, సిరీస్‌లలో వైభవ్ సూర్యవంశి మెరుగైన ప్రదర్శన చేయాలని ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. "నా శుభాకాంక్షలు వైభవ్ సూర్యవంశికి ఎప్పుడూ ఉంటాయి" అని మోడీ అన్నారు.

ఐపీఎల్ 2025లో సంచలనం

వైభవ్ సూర్యవంశి IPL 2025లో తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించారు. ఆ మెరుపు సెంచరీతో వైభవ్ సూర్యవంశి పలు అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. అతను ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, T20 క్రికెట్‌లో సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పారు. ఇంగ్లండ్ టూర్‌లో భారత అండర్-19 జట్టు వైభవ్ సూర్యవంశి నుంచి ఇదే విధమైన మెరుపు ప్రదర్శనను ఆశిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories