సంప్రదాయ క్రికెట్‌పై ఐసీసీ సంచలన నిర్ణయం

సంప్రదాయ క్రికెట్‌పై ఐసీసీ సంచలన నిర్ణయం
x
ఐసీసీ టెస్ట్.. Team India File Photo
Highlights

సంప్రదాయ క్రికెట్‌లో నూతన నిబంధనలు తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) భావిస్తోంది.

సంప్రదాయ క్రికెట్‌లో నూతన నిబంధనలు తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) భావిస్తోంది. అందులో భాగంగా ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే2023లో తీసుకురావాలనే నిచ్చయంతో ఉంది. త్వరలోనే దీనిపై ఓ కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నిర‌్ణయం కొత్త తీసుకుంది కాదు గతంలో ఇంగ్లాండ్ , ఐర్లాండ్ మధ్య నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లోనూ సౌతాణాఫ్రికా, జింబాబ్వేలు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌ నిర్వహించింది. ఈ మ్యాచ్‌‌లు సక్సెస్ కావడంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది. క్రికెట్ ఆడే పలు దేశాల్లో టీ20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్ లో మరిన్ని టెస్టు మ్యాచులు ఆడే అవకాశం ఉంది.

కాగా.. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. నాలుగు రోజుల టెస్టుకు సమయం ఉంది. దీనిపై అప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుంది. బీసీసీఐ వద్దకు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. ఐసీసీ దర్గర నుంచి ప్రతిపాదన వస్తే అప్పుడు స్పందిస్తామని గంగూలీ స్పష్టం చేశారు.

గతంలో ఆరు రోజుల టెస్టు మ్యాచులను ఐదు రోజులకు కుదించిన సంగతి తెలిసిందే. ఇక తాజా నిర్ణయం తీసుకుంటే 2023 నుంచి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ను చూస్తాం. ఇప్పటికే టెస్టుల్లో అనేక మార్పులను ఐసీసీ తీసుకొచ్చింది. అందులో భాగంగా డే/నైట్ టెస్టు మ్యాచ్ లకు శ్రీకారం చూట్టింది. మొదట ఈ ప్రతిపాదను వ్యతిరేకించిన బీసీసీఐ గంగూలీ అధ్యక్షుడు కాగానే.. బంగ్లాదేశ్ టీమిండియా మధ్య మొదటి డే/నైట్ మ్యాచ్ కోల్ కతా వేదికగా నిర్వహించారు. ఈ చారిత్రక టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories