ధోని రీఎంట్రీపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ధోని రీఎంట్రీపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
x
MS Dhoni And Lal File Photo
Highlights

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూన్నాయి.

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూన్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ అనంతరం ధోని మైదానంలో అడుగె పెట్టలేదు. న్యూజిలాండ్ జట్టుపై తన చివరి మ్యాచ్ ఆడాడు. క్రికెట్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత రెండు నెలల పాటు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు. ధోని భారత సైనికుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. రెండు నెలల పాటు సైన్యంలో పనిచేసిన ధోని వారి సమస్యలపై అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. సైన్యం చేరిన వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలియజేసేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్మించేందుకు పునుకున్నారు. భారత మిలటరీ దళల పనితనాన్ని దేశం కోరు వారు పాటుపడుతున్న విధానాన్ని అందరికీ తెలియచేసేలా షో నిర్మించనున్నారు.

ఈ నేపథ్యంలో ధోని పునరాగమనంపై మాజీ ప్లేయర్ మదన్ లాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోని తన పునరాగమనంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ధోనికి ప్రాక్టీస్ లేదని, తిరిగి జట్టులోకి రావాలంటే ప్రాక్టీస్ ముఖ్యమని మదన్ లాల్ తెలిపారు. ధోని టీమిండియాలో తిరిగి ఆడడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ప్రశ్నించగా ధోని నే అడగాలని సూచించారు. దీంతో ధోని మాత్రం జనవరి వరకు ఎలాంటి ప్రశ్నలు అడగవద్దని స్పష్టం చేశారు. ధోనీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలను కుంటే , దేశవాలీ మ్యాచ్‌ల్లో ఆడాలని, ఫామ్ రావాలంటే అవసరముందని మదన్ లాల్ అన్నారు. భారత జట్టులోకి వచ్చి మ్యాచ్‌లు ఆడడం ధోనీకి కష్టంగా ఉంటుందని లాల్ పేర్కొన్నారు.

గత కొంత కాలంగా ధోని క్రికెట్ దూరంగా ఉన్నారు. అతను చివరి వన్డే జూలైలో న్యూజిలాండ్ పై ఆడాడు. ఆ తర్వాత ధోని పునరాగమనం చేయలేదు. జట్టులోకి పునరాగమంపై ప్రశ్నించగా జనవరి వరకూ ఓపిక పట్టాలని అప్పటి వరకూ ఏమి అడగవద్దని కోరారు. 350 వన్డే మ్యాచులు ఆడిన ధోని పదివేల పైచిలుకు పరుగులు సాధించాడు. 98టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. ధోని తన చివరి టీ20 మ్యాచ్ ఆస్ట్రేలియాపై 2019 ఫిబ్రవరిలో ఆడారు. ధొని పునరాగమనంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా పలు వ్యాఖ్యా చేసిన సంగతి తెలిసిందే. ధోని రీఎంట్రీపౌ ఆయన నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories