Shane Warne: రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేన్ వార్న్.. అతివేగమే కారణం

Shane Warne: రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేన్ వార్న్.. అతివేగమే కారణం
x
Highlights

*ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు ఆస్ట్రేలియా మీడియా ప్రకటించింది.

Shane Warne: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు ఆస్ట్రేలియా మీడియా ప్రకటించింది. తన కుమారుడు జాసన్ తో స్పోర్ట్స్ బైక్ పై మెల్బోర్న్ లో రైడ్ వెళ్ళినపుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అయితే స్వల్ప గాయాలతో షేన్ వార్న్ తో పాటు అతడి కుమారుడు బయటపడినట్లు తెలిపింది.

తాజాగా ఈ ప్రమాదంపై స్పందించిన షేన్ వార్న్ తాను అదుపు తప్పి బైక్ కిందపడిపోయానని ఆ సమయంలో కాస్త భయపడినట్లు తెలిపాడు. అయితే మరుసటి రోజు నడవటానికి కూడా రాకపోవడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళడంతో వైద్యులు పరీక్షలు జరిపి కాలికి ఇంటర్నల్ గా గాయమైనట్లు తెలిపారన్నాడు షేన్ వార్న్. ఇక త్వరలో గబ్బాలో జరగబోయే యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్ కి అందుబాటులో ఉంటానని షేన్ వార్న్ తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories