India vs New Zealand: భారత బౌలర్లు విఫలం... ఫస్ట్ వన్డేలో టీమిండియా ఓటమి

India vs New Zealand: అక్లాండ్‎లో భారత్‎పై 7వికెట్ల తేడాతో ఘన విజయం

Jyothi
Published on: 25 Nov 2022 3:25 PM IST
First Odi Match Between New Zealand vs India
X

India vs New Zealand: భారత బౌలర్లు విఫలం... ఫస్ట్ వన్డేలో టీమిండియా ఓటమి 

India vs New Zealand: మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ‎భారత్‎పై భారత్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్య ఛేదనను కివీస్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 47.1 ఓవర్లలో 309 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్ టామ్‌ లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులు చేయగా.. కేన్‌ విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో ఫిన్‌ అలెన్ 22, డేవన్ కాన్వే 24, డారిల్ మిచెల్ 11 పరుగులు చేశారు. భారత బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 2, శార్దూల్‌ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ క్రికెటర్లలో శిఖర్ ధావన్‌ 72, శుభ్‌మన్ గిల్ 50, శ్రేయస్‌ అయ్యర్ 80. వాషింగ్టన్‌ సుందర్ 37, సంజూ శాంసన్ 36 పరుగులు చేశారు. అలా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.

Jyothi

Jyothi

Next Story