IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. నాలుగు వికెట్ల దూరంలో భారత్ విజయం

IND vs BAN: విజయానికి 4వికెట్ల దూరంలో టీమిండియా

Jyothi
Published on: 17 Dec 2022 6:05 PM IST
First Match Between Team India vs Bangladesh Fourth Day Game
X

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. నాలుగు వికెట్ల దూరంలో భారత్ విజయం

IND vs BAN: బంగ్లాదేశ్‎తో భారత్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. మరో నాలుగు వికెట్ల దూరంలో టీమ్​ఇండియా విజయానికి చేరువైంది. టీమ్ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా నాలుగో రోజు ఆట ముగిసేసరికి 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రేపు చివరి రోజు మ్యాచ్‎లో బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు లక్ష్యం ఉంది. ప్రస్తుతం క షకీబ్​ అల్​హసన్​ 40 పరుగులు, మెహెడి 9 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‎తో తొలి టెస్టు ఆడుతున్న బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ సెంచరీ కొట్టాడు. మరో ఓపెనర్ నజ్ముల్ షాంటో 67తో కలిసి తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించాడు. మిగతా వారంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. అటు భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3.. ఉమేశ్‌, కుల్‌దీప్‌, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

Jyothi

Jyothi

Next Story