పాండ్యా తండ్రైన వార్త విని.. కోహ్లీ వాళ్ల కుటుంబంలో గొడవలు సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్!

పాండ్యా తండ్రైన వార్త విని.. కోహ్లీ వాళ్ల కుటుంబంలో గొడవలు సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్!
x
Highlights

టీమిండియా ప్లేయర్ పాండ్యా తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చిక్కొచిపడింది.

టీమిండియా ప్లేయర్ పాండ్యా తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చిక్కొచిపడింది.ఇక పాండ్యా తండ్రి కావడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మకు ఇబ్బందిగా మారింది. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్న పాండ్యా తండ్రి అయ్యాడని, మరీ మీరెప్పుడూ విరుష్కా? అంటూ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

పాండ్యా తండ్రైన వార్త విని విరాట్ కోహ్లీ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, వాళ్ల అమ్మ ఒత్తిడి తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఫన్నీ కామెంట్స్, మీమ్స్‌తో ట్రెండ్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి ఐదేళ్లకు జీవాను కంటే.. పాండ్యా 5 నెలలకే నటాషాను ప్రెగ్నెంట్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. పాండ్యాపై అభిమానులు ప్రశంసలతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుందని ఆదివారం హార్దిక్‌ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈ ఏడాది జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్‌ నటాషా, పాండ్యా నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి హార్దిక్‌ పాండ్యా, నటాషా సహజీవనం చేస్తున్నారు. అయితే ఆదివారమే విడుదల చేసిన పాండ్యా, నటాషా పూలదండలతో మరో ఫొటోలో కనిపిస్తున్నారు. ఇది పెళ్లికి సంబంధించిన ఫొటోనా కాదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది.. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి' అని పోస్ట్ చేశాడు. 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.














Show Full Article
Print Article
More On
Next Story
More Stories