Bishan Singh Bedi: ప్రముఖ మాజీ క్రికెటర్​ బిషన్ సింగ్ బేడీ మృతి

Famous Former Cricketer Bishan Singh Bedi Passed Away
x

Bishan Singh Bedi: ప్రముఖ మాజీ క్రికెటర్​ బిషన్ సింగ్ బేడీ మృతి

Highlights

Bishan Singh Bedi: ఎంతో మంది దిగ్గజ బౌలర్లను తయారు చేసిన స్పిన్ మాంత్రికుడు

Bishan Singh Bedi: లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. భారత్ తరఫున ఆయన 67 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 370 మ్యాచుల్లో 10 వికెట్లు తీశారు. మంది యువ క్రీడాకారులను తీర్చిదిద్దారు. దిగ్గజ స్పిన్నర్ 1967 నుంచి 1979 మధ్య భారత్‌ తరపున 67 టెస్టుల్లో 266 వికెట్లు తీశాడు. 10 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించింది బిషన్‌సింగ్‌ బేడినే. 1975 వరల్డ్ కప్ మ్యాచ్‌లో మొత్తం 12 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులే ఇచ్చారు. ఈ 12 ఓవర్లలో ఏకంగా 8 ఓవర్లు మెయిడిన్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా విజయానికి బిషన్ సింగ్ బేడీ కీలకమయ్యారు. పలువురు రిటైర్డ్ క్రికెటర్లు బేడీ మృతికి సంతాపం తెలిపారు. ఎరపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌ వెంకటరాఘవన్లతో పాటు బేడీ భారత్‌ స్పిన్ బౌలింగ్‌ దశ, దిశను మార్చిన ఘనత బిషన్ సింగ్ బేడీకి దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories