Quinton de Kock: జమాన్ (193) రనౌట్.. సరికొత్త వివాదం; డికాక్ పై సర్వత్రా ఆగ్రహం

Fakhar Zaman Run Out On 193 After Fake Fielding by Quinton De Kock
x

జమాన్ (193) రనౌట్  (ఫొటో ట్విట్టర్) 

Highlights

Quinton de Kock: పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ (193: 155 బంతుల్లో) డబుల్ సెంచరీ చేసేందుకు మరో 7 పరుగుల దూరంలో ఉన్నాడు.

Quinton de Kock: పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ (193: 155 బంతుల్లో 18x4, 10x6) డబుల్ సెంచరీ చేసేందుకు మరో 7 పరుగుల దూరంలో ఉన్నాడు. అనుకున్నట్లు జరిగితే.. తన కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేసేవాడు. కానీ, డికాక్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడంతో అనూహ్యరీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికాతో జొహనెస్‌బర్గ్ వేదికగా తాజాగా ముగిసిన రెండో వన్డేలో జరిగిన ఈ వ్యవహారం పాక్ క్రికెట్ లవర్స్ ని షాక్ కి గురి చేసింది. ఫకార్ జమాన్.. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ ఫేక్ ఫీల్డింగ్ కారణంగా రనౌటయ్యాడు.

తొలుత ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. డికాక్‌(80), కెప్టెన్‌ బవుమా(92), వాండర్‌ డసెన్‌(60), మిల్లర్‌(50) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌లో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్‌(192) పరుగులతో ద్విశతకానికి చేరువలో ఉన్నాడు.

అయితే, ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్‌ రన్‌ తీయబోయిన జమాన్‌ రెండో పరుగు పూర్తి చేసే సమయంలో రనౌటయ్యాడు. ఫీల్డర్‌ మార్‌క్రమ్‌ డైరెక్ట్‌ త్రో విసరడంతో పెవిలియన్‌ చేరాడు. కానీ, ఇక్కడే దక్షిణాఫ్రికా కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ ఓ ట్రిక్ ప్లే చేశాడు. జమాన్‌ రెండో పరుగు కోసం క్రీజులోకి వస్తుండగా ఫీల్డర్‌ త్రో విసిరిన బంతి నాన్‌ స్ట్రైకర్‌ వైపు వెళ్తున్నట్లు సైగలు చేశాడు. దాంతో జమాన్ అటువైపు తిరిగి చూశాడు. ఈలోపే బంతి వికెట్లకు తాకడంతో రనౌటయ్యాడు. కాగా, రీప్లేలో డికాక్‌ ఉద్దేశపూర్వకంగా జమాన్‌ను తప్పుదోవ పట్టించినట్లుగా కనిపించింది. చివరికి పాక్‌ 50 ఓవర్లలో 324/9తో నిలిచింది. దక్షిణాఫ్రికా 17 పరుగులతో విజయం సాధించింది. దీన్ని పాక్‌ అభిమానులు, మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తప్పుబట్టారు. డికాక్‌ చేసింది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories