మూడు ప్రపంచకప్‌ల విన్నర్.. ఇక క్రికెట్‌కు గుడ్ బై

మూడు ప్రపంచకప్‌ల విన్నర్.. ఇక క్రికెట్‌కు గుడ్ బై
x
Laura marsh
Highlights

ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు స్పిన్నర్ మార్ష్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.

ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు స్పిన్నర్ మార్ష్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ అనంతరం తప్పుకుంటున్నట్లు ప్రకటిచారు. ఈ స్టార్ స్పిన్నర్ 2006లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశారు. 13 ఏళ్ల క్రికెట్ కెరీర్ మార్ష్ అద్భుత ప్రదర్శన చేశారు. 217 వికెట్లు తీశారు.

అయితే లౌరా మార్ష్‌ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పేస్ బౌలర్ గా అవతారమెత్తారు. కొన్ని మ్యాచ్ అనంతరం స్పిన్నర్ గా మారారు. ఇంగ్లండ్‌ జట్టు తరఫున వన్డేలో లౌరా మార్ష్‌ అత్యధిక వికెట్లు సొంతం చేసుకున్న 3వ బౌలర్ గా ఘనత సాధించారు. మార్ష్‌ తన 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నారు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించారు. 2009లో జరిగిన ఈ ప్రపంచ కప్ లో మార్ష్ 16 వికెట్లు పడగొట్టారు.

ఇక 2017లో ఇంగ్లండ్‌ మహిళ క్రికెట్ జట్టు గెలిచిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఆమె ప్రాతినిధ్యం వహించారు. మార్ష్ తన కెరీర్‌లో 9 టెస్టులు,103 వన్డేలు, 67 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. అన్ని ఫార్మాట్లలో 217 వికెట్లు పడగొట్టారు.

మార్ష్‌ రిటైర్మెంట్‌పై స్పందించారు ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ బోర్డు డైరక్టర్‌ క్లార్‌ కానోర్‌. ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ చరిత్రలో లౌరా మార్ష్‌ అత్యుత్తమ బౌలర్లలో ఒకరన్నారు. లౌరా శ్రమను, క్రికెట్ కు అందించిన సేవలను ఎప్పటీ మరిపోమని తెలిపారు. ఆమెలోని అంకిత భావం, నిజాయితీ ఉన్నత స్థానంలో నిలబెట్టాయి అని వెల్లడించారు. మూడు ప్రపంచ కప్ లు ఆడిన ప్లేయర్లలో లౌరా ఒకరి కానోర్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories