Ind vs Eng Test: ఇంగ్లాండ్ 391 ఆలౌట్‌.. నాలుగో రోజు ఆటకి వర్షం పడే ఛాన్స్

England Team All Out to 391 Runs And Captain Root Captain Innings With 180 Runs in India vs England Second Test
x

లార్డ్స్ వేదిక (ట్విట్టర్ ఫోటో)

Highlights

India vs England Test: లార్డ్స్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్...

India vs England Test: లార్డ్స్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాట్ తో బరిలోకి దిగిన భారత జట్టుకు రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడి మంచి భాగస్వామ్యం అందించిన పూజారా, అజింక్య రహనేలు మాత్రం మరోసారి తమ పేలవమైన ప్రదర్శనతో తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. మొదటి టెస్ట్ లో సున్నా పరుగులకే వెనుతిరిగిన కోహ్లి రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

కేఎల్ రాహుల్ సెంచరీతో భారత్ మొదటి ఇన్నింగ్స్ 364 పరుగులు సాధించింది. ఆ తరువాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జోరూట్‌ 180 పరుగులతో పాటు బెయిర్‌స్టో అర్థసెంచరీతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో రాణించారు. ఇక భారత బౌలర్స్ లో సిరాజ్ 4 వికెట్స్ తో పాటు ఇషాంత్ శర్మ 3 వికెట్స్ తీసి ఇంగ్లాండ్ జట్టును 391 పరుగులకు కట్టడి చేసింది. దాంతో భారత్ పై ఇంగ్లాండ్ మూడోరోజు ముగిసే సమయానికి ఇండియాపై 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆటకి వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయని లండన్ వాతావరణ శాఖ తెలిపింది.

భారత్ బ్యాటింగ్ :

మొదటి ఇన్నింగ్స్ : 364/10

కేఎల్ రాహుల్ : 129

రోహిత్ శర్మ : 83

ఇంగ్లాండ్ బౌలింగ్:

ఆండర్సన్ : 29-62-5

రాబిన్సన్ : 33-73-2

వుడ్ : 24.1-91-2

ఇంగ్లాండ్ బ్యాటింగ్:

మొదటి ఇన్నింగ్స్ : 391/10

జోరూట్‌ : 180*

బెయిర్‌స్టో: 57

భారత బౌలింగ్:

సిరాజ్ : 26-94-4

ఇషాంత్ శర్మ: 24-69-3

షమీ : 26-95-2

Show Full Article
Print Article
Next Story
More Stories