ఇంగ్లండ్ భారీస్కోరు.. టీమిండియా ఫాలోఆన్ తప్పించుకోవాలంటే 378 చేయాల్సిందే!

India vs Egland Test Match highlights
x

ఇండియా-ఇంగ్లాండ్ చెన్నై టెస్ట్ మ్యాచ్ 

Highlights

టీమిండియా తో చెన్నై లో జరుగుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ తన నిర్ణయంతో లాభ పడింది. రెండున్నర రోజులు..190.1 ఓవర్లు.. బ్యాటింగ్ చేసి..578 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే టీమిండియా 378 పరుగులు చేయాలి. ఇప్పుడు ఈ మొదటి లక్ష్యం భారత్ చేరుకున్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ఇంగ్లండ్ దే పైచేయిగా కనిపిస్తోంది. టీమిండియా గెలుపు అవకాశాలు దాదాపు తక్కువనే క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్ డ్రా కావడం లేదా.. ఇంగ్లండ్ విజయం ఈ రెండిటికే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది.

శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 555 పరుగులు చేసింది. దానికి కొనసాగింపుగా ఆదివారం మూడోరోజు ఆట మొదలైన కొద్ది సేపటికే.. మరో 23 పరుగులు జత చేసి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయిపోయారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 578 పరుగులు చేసినట్టయింది.

ఇంగ్లండ్ టీం లో రోరీ బుర్న్స్ 33, డామ్ సిబ్లీ 87 పరుగులు చేశారు. ఇక 100 వ టెస్ట్ ఆడుతున్న జో రూట్ 218 పరుగులు చేసి.. నూరో మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించారు. ఇక బెన్ స్టోక్స్ 82, ఓలీ పోప్ 34, జోస్ బట్లర్ 30, డామ్ బెస్ 34, జేమ్స్ ఆండర్సన్ 1, జోఫ్రా ఆర్చర్ 0 పరుగులకు అవుట్ కాగా, జాక్ లీచ్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక భారత బౌలర్లతో జస్ ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ కు మూడేసి వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, షాబాజ్ నదీమ్ కు రెండేసి వికెట్లు పడగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories