ENG vs SL: శ్రీలంకకు షాక్.. సూపర్-8లో ఇంగ్లండ్ ఘన విజయం!

ENG vs SL
x

ENG vs SL: శ్రీలంకకు షాక్.. సూపర్-8లో ఇంగ్లండ్ ఘన విజయం!

Highlights

ENG vs SL: టీ20 ప్రపంచకప్‌ 2026లో సహ ఆతిథ్య జట్టు శ్రీలంకకు తొలి ఓటమి ఎదురైంది. లీగ్‌ దశలో అజేయంగా సూపర్-8కు చేరుకున్న శ్రీలంకను ఇంగ్లండ్ 51 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

ENG vs SL: టీ20 ప్రపంచకప్‌ 2026లో సహ ఆతిథ్య జట్టు శ్రీలంకకు తొలి ఓటమి ఎదురైంది. లీగ్‌ దశలో అజేయంగా సూపర్-8కు చేరుకున్న శ్రీలంకను ఇంగ్లండ్ 51 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపి విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ పన్నిన స్పిన్‌ ఉచ్చులలో శ్రీలంక బలైంది. 147 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచులో ఏడు వికెట్లను ఇంగ్లాండ్‌ స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. లంక కెప్టెన్ దాసున్ శనక 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అతనికి తోడుగా జోఫ్రే ఆర్చర్ రెండు, లియామ్ డాసన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆదిల్ రషీద్, జెమీ ఓవర్తన్ చెరో వికెట్ పడగొట్టి శ్రీలంకను కట్టడి చేశారు. ముఖ్యంగా విల్ జాక్స్ స్పిన్‌కు శ్రీలంక బ్యాటర్లు పూర్తిగా తలొగ్గారు. అతని బౌలింగ్ దెబ్బకు మిడిల్ ఆర్డర్ కూలిపోవడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు తిరిగింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సూపర్-8 దశలో బలమైన ఆరంభం చేయగా.. శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ వైపు ముందగు వేయగా.. లంక అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఈ మ్యాచులో ముందుగా శ్రీలంక బౌలర్లు అదరగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (62) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విల్‌ జాక్స్‌ (21) మినహా బ్యాటర్లెవరూ రాణించలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో దునిత్‌ వెల్లలాగే 3 వికెట్లు పడగొట్టాడు. మహీశ్‌ తీక్షణ, దిల్షాన్‌ మధశంక చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక చమీర ఒక వికెట్ తీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories