MI vs CSK: ధోనీతో ముంబైకి దబిడి దిబిడే.. ఇది జరిగితే తప్పు పాండ్యా టీమ్ గెలవలేదు!

MI vs CSK
x

MI vs CSK: ధోనీతో ముంబైకి దబిడి దిబిడే.. ఇది జరిగితే తప్పు పాండ్యా టీమ్ గెలవలేదు!

Highlights

MI vs CSK: చెన్నైకి అనుకూలంగా పిచ్ మారినా, అది ఎంతవరకు వారిని నిలబెడుతుందో అనేది చూడాలి.

MI vs CSK

ఎల్-క్లాసికో మళ్లీ వచ్చేసింది. కానీ ఇది స్పానిష్ ఫుట్‌బాల్‌లోది కాదు. ఇది IPL ఎల్-క్లాసికో..! ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ జరుగుతుందని తెలిసిన క్షణం నుంచే ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తుంది. కారణం స్పష్టమే.. ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్నవిగా నిలిచాయి. ధోనీ కోసం చెన్నై, సచిన్ కోసం అప్పట్లో ముంబై.. అలా మొదలైన అభిమాన భావాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ఓ దశలో ఐపీఎల్ అంటేనే ముంబై-చెన్నై పోరుగా భావించే పరిస్థితి ఏర్పడినది. ఇప్పట్లో ఈ రెండు జట్లు తమ టాప్‌ ఫేజ్‌లో లేనప్పటికీ, ఈ జోడీ మధ్య పోరుకు వచ్చే క్రేజ్ మాత్రం తగ్గింది లేదు. టీవీలకు టీఆర్పీ వస్తే, సోషల్ మీడియాకు ట్రాఫిక్. గత మ్యాచ్‌లో చెన్నై గెలిచినా, దాని తర్వాత ఆ జట్టుకి అన్నీ తలకిందులయ్యాయి. ముంబైపై గెలిచి, కప్ దగ్గరలోనే ఉందనుకున్నారేమో కానీ, టేబుల్ లో కదలికే లేకుండా పోయింది. మరోవైపు ముంబై కూడా వరుసగా ఓడిపోతూ అభిమానుల నమ్మకాన్ని కొంతవరకు పోగొట్టింది. కానీ సన్‌రైజర్స్‌పై భారీ గెలుపుతో మళ్లీ తమ ఆట తీరుతో హెచ్చరికలు ఇచ్చింది.

ఇక ఈసారి వాంఖేడే వేదిక. చెన్నై సూపర్ కింగ్స్ పేపర్ మీద చాలా వీక్‌గా కనిపిస్తోంది. టోర్నమెంట్ మధ్యలో డెవాల్డ్ బ్రెవిస్‌ను జట్టులో చేర్చుకునే స్థితికి వచ్చేసిన ఈ జట్టు, అతని రాకతో తమ బ్యాటింగ్ కొంత మెరుగుపడుతుందని ఆశిస్తోంది. కానీ స్పిన్ డిపార్ట్‌మెంట్ తప్ప, మిగతా విభాగాలన్నీ లోపాలతో నిండిపోయి ఉన్నాయి. వాంఖేడే పిచ్ స్వభావం గత మ్యాచ్‌లో చెపాక్‌కి దగ్గరగా కనిపించింది. అదే పిచ్ ఈ మ్యాచ్‌కి ఉపయోగిస్తే, చెన్నై స్పిన్నర్లు, పేసర్‌ల ఆఫ్‌కట్టర్‌లు ఉపయోగించుకుని ముంబైకి సమస్యలు కలిగించగలరేమో చూడాలి. కానీ ఇది కూడా ఓ అవకాశమే తప్ప, గ్యారంటీ కాదు.

ఇటు ముంబై విషయానికి వస్తే, ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. బ్యాటింగ్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ వరకు బలంగా ఉంది. రోహిత్ శర్మ పెద్ద స్కోర్లు చేయకపోయినా, ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే ప్రయత్నం మాత్రం ఇస్తున్నాడు. అతను చెన్నైపై తన పాత ఆటతీరు కనబరిస్తే, ముంబైకి వెనక్కి తిరిగే అవసరమే ఉండదు. బుమ్రా రాకతో బౌలింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. హార్దిక్ పాండ్యా తన బ్యాట్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. తిలక్ వర్మ కూడా మంచి షాట్‌లో ఉన్నాడు. అన్నీ కలిసి చూస్తే ముంబై ఇండియన్స్ స్పష్టమైన ఫేవరెట్. చెన్నైకి అనుకూలంగా పిచ్ మారినా, అది ఎంతవరకు వారిని నిలబెడుతుందో అనేది చూడాలి. ఇక ముంబై ఇప్పటికే చెన్నైకి సవాల్ విసిరింది. అరేబియా సముద్రంలో కొడితే.. పోయి బే అఫ్ బెంగాల్ లో పడతారంటూ చెన్నై ఫ్యాన్స్‌కు ముంబై ఫ్యాన్స్‌ ఛాలేంజ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories