Axar Patel DC Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్

Axar Patel DC Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్
x
Highlights

Axar Patel DC Captain: IPL 2025 కి ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. అక్షర్ పటేల్ ను జట్టుకు కెప్టెన్ గా ప్రకటించింది . దీనికి...

Axar Patel DC Captain: IPL 2025 కి ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. అక్షర్ పటేల్ ను జట్టుకు కెప్టెన్ గా ప్రకటించింది . దీనికి ముందు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఈసారి అతను లక్నో సూపర్ జెయింట్స్‌లో భాగమయ్యాడు.

IPL 2025 మార్చి 22న ప్రారంభమవుతుంది. అంటే టోర్నమెంట్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తన కొత్త కెప్టెన్ పేరును కూడా ప్రకటించింది. 18వ సీజన్‌లో ఢిల్లీ జట్టు సారథ్య బాధ్యతలను అక్షర్ పటేల్‌కు అప్పగించింది. ఇంతకుముందు రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఈ సీజన్‌లో అతను లక్నో సూపర్ జెయింట్స్‌లో భాగమయ్యాడు. IPL 2025 కి ముందు, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ అక్షర్ కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఐపీఎల్ ఆడుతున్న 10 జట్లలో 9 జట్లు ఇప్పటికే తమ కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories