వైరల్ వీడియో : కోహ్లీ అంటూ బ్యాటింగ్ చేస్తున్న వార్నర్ కూతురు

David Warner and Virat Kohli
x
David Warner and Virat Kohli
Highlights

ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమనించే వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్...

ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమనించే వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూతురు ఇండి రే కూడా చేరింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా తన ఇన్‌స్టాలో తెలిపారు. వార్నర్ మూడేళ్ల కూతురు ఇండి రే బ్యాటింగ్ చేస్తున్న ఓ వీడియో ఇన్‌స్టాలో ఉంచి మంచి క్యాప్షన్ ఇవ్వాలని కోరారు. ఇండిరే బ్యాంటింగ్ మధ్యలో విరాట్ కోహ్లీ అంటూ బ్యాటింగ్ చేయడం విశేషం. డేవిడ వార్నర్ పెట్టిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమైయ్యే టెస్టు సిరీస్ కు విరాట్ కోహ్లీ అందుబాటులోకి రానున్నారు. బంగ్లాతో జరుగుతోన్న టీ20 సిరీస్ కు కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ తాత్కాలిక కెప్టెన్ గా చేస్తున్నారు. ఇప్పటికే రెండు టీ20లు ఆడిన ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories