థ్యాంక్స్‌ కోహ్లి.. నీ వల్లే నా కూతురు సంతోషంగా ఉంది: వార్నర్

థ్యాంక్స్‌ కోహ్లి.. నీ వల్లే నా కూతురు సంతోషంగా ఉంది: వార్నర్
x

కోహ్లీ వార్నర్


Highlights

ఆస్ట్రేలియా విద్వంస ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా విద్వంసక ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోర్డర్ గవస్కర్ ట్రోఫిలో భాగంగా ఆసీస్ భారత్ మధ్య జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో 2-1తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి టెస్టు జరిగిన గబ్బా మైదానంలో ఆసీస్‌ విధించిన 324 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ఆసీస్‌ 32 ఏళ్ల జైత్రయాత్రకు చెక్‌ పెట్టింది. ఈ సంద్భంగా ఆసీస్ బ్యాట్స్ మెన్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఓడిపోనప్పటీకి కోహ్లీ మనసు గెలిచాం అని వాఖ్యానించాడు. దీనికి కారణం కోహ్లీ తన టెస్టు క్రికెట్ జెర్సీని వార్నర్ కూతురుకు పంపించాడు.

ఇక వివరాల్లో వెళ్తే.. వార్నర్ ముద్దుల కూతురు కోహ్లి జెర్సీని ధరించి ఫోటోకు ఫోజిచ్చింది. ఈ సందర్భంగా వార్నర్‌ కోహ్లికి థ్యాంక్స్‌ చెప్పాడు. మేం సిరీస్‌ ఓడిపోయామని , కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్నతన చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్‌ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా ధన్యవాదాలు అంటూ వార్నర్ ఇన్ స్టాలో పోస్టు చేశాడు‌.

కాగా ఆసీస్‌ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఫిబ్రవరి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు తొలి టెస్టు, ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు రెండో టెస్టు చెన్నై వేదికగా జరగనున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories