పాకిస్తాన్ మైనారిటీలకు మీ సహాయం అవసరం : యువరాజ్, హర్భజన్లకు కనేరియా విజ్ఞప్తి

పాకిస్తాన్ మైనారిటీలకు మీ సహాయం అవసరం : యువరాజ్, హర్భజన్లకు కనేరియా విజ్ఞప్తి
x
Highlights

కరోనావైరస్ సంక్షోభానికి ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇందులో చిన్న చిన్న దేశాల పరిస్థితి అయితే మరి ఘోరంగా ఉంది. ఒకవైపేమో...

కరోనావైరస్ సంక్షోభానికి ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇందులో చిన్న చిన్న దేశాల పరిస్థితి అయితే మరి ఘోరంగా ఉంది. ఒకవైపేమో కరోనా విజృంభణ మరోవైపు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా చేరిపోయింది. దాంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా పాకిస్థాన్ ప్రధాన మంత్రి సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో జయదేవ్ చౌదరి అనే వ్యక్తి పాక్ లో ఉండే మైనారిటీల (హిందువులు మరియు క్రైస్తవులు) కోసం పేస్ బుక్ లో ఫండ్ రైసింగ్ ను క్రియేట్ చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు.. 'కోవిడ్ -19 లాక్-డౌన్ కారణంగా పాకిస్తాన్ లోని హిందువులకు ఆహార సామాగ్రి నిరాకరించబడిందనే వార్త అందరూ విని ఉంటారు.

ముస్లింలకు మాత్రమే ఉద్దేశించినందున మైనారిటీ (హిందువులు మరియు క్రైస్తవులు) లకు ఆహార సామాగ్రికి అర్హులు కాదని కొందరు అధికారులు తెలిపారు. ఈ చర్యను హిందువులు, క్రైస్తవులు మాత్రమే కాకుండా సిక్కులు కూడా ఖండించారు. ఇటీవల, పాకిస్తాన్లోని మైనారిటీలకు ఆహార సరఫరాకు సహాయం అందించాలని నాకు చాలా అభ్యర్థనలు వచ్చాయి. తెలిసిన మరియు తెలియని స్నేహితులందరినీ మైనారిటీల కోసం కోసం ఉదారంగా విరాళం ఇవ్వమని నేను అభ్యర్థిస్తున్నాను.' అంటూ జయదేవ్ చౌదరి పేర్కొన్నారు. అయితే దీనిని పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా తనకు చెందిన ట్విట్టర్ ఖాతా ద్వారా తన స్నేహితులకు పంపారు.

ఇందులో కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్న తమ దేశంలో నివసిస్తున్న మైనారిటీలకు సహాయం చేయాలనీ ట్విట్టర్ లో పేర్కొంటూ పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ పోస్టును భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్ మరియు హర్భజన్ సింగ్ లకు ట్వీట్ చేసి మైనారిటీలకు మీ వంతు సహాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు కనేరియా. కాగా కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో చేరిన షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కు యువరాజ్ సింగ్ మరియు హర్భజన్ సింగ్ మద్దతు ఇచ్చిన కొద్ది రోజుల తరువాత కనేరియా ఈ విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories