యూఎస్ ఓపెన్ విజేత డానిల్ మెద్వెదెవ్, ఫైనల్లో నొవాక్ జకోవిచ్ పరాజయం

Daniil Medvedev Won in US Open 2021 Finals and Novak Djokovic Lost | Sports News Today
x

యూఎస్ ఓపెన్ విజేత డానిల్ మెద్వెదెవ్

Highlights

US Open 2021: *వరుస సెట్లలో గెలిచిన రష్యా ఆటగాడు *రికార్డు ముంగిట నొవాక్ జకోవిచ్‌కు నిరాశ

US Open 2021: మరొక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిస్తే 21 టైటిళ్లతో చరిత్రలో నిలిచిపోతాడనగా, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ ఫైనల్లో గర్వభంగం జరిగింది. ఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ చేతిలో జకోవిచ్ 4-6, 4-6, 4-6 తేడాతో ఘోర పరాజయం చవిచూశాడు. అయితే, ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో నాదల్, ఫెదరర్‌ల రికార్డును సమం చేసిన జకోవిచ్‌కు ఈ ఓటమి తీవ్ర వేదన మిగిల్చింది.

పురుషుల సింగిల్స్‌లో రికార్డు నమోదు చేయాలని భావించిన జకోవిచ్ కలలు భగ్నమయ్యాయి. దాంతో ఈ సెర్బియా ఆటగాడు తీవ్ర అసహనంతో రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. ఆపై భోరున విలపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories