ప్లే ఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్న చెన్నై

ప్లే ఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్న చెన్నై
x
Highlights

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌–12 సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.దీంతో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఈ...

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌–12 సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.దీంతో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలిజట్టుగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై జయభేరి మోగించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్ జూలు విదిల్చింది. వాట్సన్ 53 బంతుల్లో 96 పరుగులు చేసి సన్‌రైజర్స్ బౌలర్లను ఆడుకున్నాడు‌. కాగా ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హర్భజన్‌కు 2 వికెట్లు దక్కాయి. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు19.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి విజయాన్నందుకుంది. అనంతరం షేన్ వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. భువీ, రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. ఇక వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్స న్‌ స్వదేశం వెళ్లడంతో షకీబుల్‌ హసన్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగాడు. భువనేశ్వర్‌ సారథ్యం వహించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories