పంజాబ్‌ పై విజయం సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

పంజాబ్‌ పై విజయం సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌
x
Highlights

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై జట్టు 160 పరుగుల చేసింది. చెన్నై ఆటగాళ్లు షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ 56 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత తొలి వికెట్‌గా వాట్సన్‌(26;24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. ఆ తరుణంలో డుప్లెసిస్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ జోడి 44 పరుగులు జత చేసిన తర్వాత డుప్లెసిస్‌(54; 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరువాత సురేశ్‌ రైనా కూడా 17 పరుగులే చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఈ క్రమంలో అంబటి రాయుడు-ఎంఎస్‌ ధోనిల జోడి బాధ్యతాయుత బ్యాటింగ్‌ చేసింది. ధోని(37 నాటౌట్‌; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అంబటి రాయుడు(21 నాటౌట్‌; 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో చెన్నై జట్టు 160 పరుగులు చేయగలింది.

ఇక 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 138 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. గేల్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(0)లు ఆదిలోనే ఔట్‌ కావడంతో కింగ్స్‌ పంజాబ్‌ కష్టాల్లో పడింది. ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(55), సర్పరాజ్‌ ఖాన్‌(67)లు మినహా ఎవరూ రాణించలేదు. దీంతో చెన్నై జట్టు 22 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చెన్నై బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌, కుగ్లీన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌కు వికెట్‌ దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories