టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు..మూడో స్థానంలో ఉమేష్ యాదవ్ !

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు..మూడో స్థానంలో ఉమేష్ యాదవ్ !
x
కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఉమేశ్ యాదవ్
Highlights

డిసెంబర్ ఆరు నుంచి వెస్టిండీస్‌ భారత్ జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లు జరనున్నాయి.

డిసెంబర్ ఆరు నుంచి వెస్టిండీస్‌ భారత్ జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లు జరనున్నాయి. అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉన్న సందర్భంగా ఈ సిరీస్‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌ను మేనేజ్‌మెంట్ ప్రయోగాత్మకమైనా మార్పులు చేయాలని యోచిస్తుంది.

విండీస్‌లో జరిగే సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్దర్ లో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పష్టమైన సంకేతాలు కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందిచారు. బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పులపై నిర్ణయం తీసుకునే ఆలోచనలు ఉన్నాయన్నారు. ఇటీవలె ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడారు.

ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో 7 బ్యాట్స్‌మెన్‌లు, 5 బౌలర్ల కాంబినేషన్‌తో భారత్ ఆడడంపై కోహ్లీ క్లారిటీ ఇచ్చారు.

ఏప్పుడు లేనంతగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఇంతకుముందు వరకూ 6 ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు, వారికితోపాటు ఒక స్పిన్నర్/ఆల్ రౌండర్, 7 స్థానంలో బ్యాటింగ్ చేస్తుండేవారు. కానీ.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆలౌరండర్ ప్రదర్శన చేసిన ఉమేశ్ యాదవ్ (కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు ) అదనంగా మరో బ్యాట్స్ మెన్ కూడా ఉన్నారని తెలిపారు. హిట్టర్‌గా మూడో స్థానంలో ఫించ్ బ్యాటింగ్‌కి పంపిస్తాం లేదా ఉమేష్ ను పంపిస్తామని కోహ్లీ సరదాగా వ్యాఖ్యానించారు.

వెస్టిండీస్‌తో డిసెంబరు 6 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ భారత్ పలు మార్పులు చేయనుంది. అంతే కాకుండా టీమిండియా విధంసకర ఓపెనర్ ధావన్ మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమైయ్యాడు. అయితే ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా గతంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. విండీస్, టీమిండియా తొలి టీ20 హైదరబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories