Rinku Singh: గ్రాండ్‌గా రింకూ, ప్రియాల‌ ఎంగేజ్‌మెంట్.. అంద‌రి దృష్టి ఆ రింగ్ పైనే

Rinku Singh
x

Rinku Singh: గ్రాండ్‌గా రింకూ, ప్రియాల‌ ఎంగేజ్‌మెంట్.. అంద‌రి దృష్టి ఆ రింగ్ పైనే

Highlights

Rinku Singh: టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్, రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. జూన్ 8, 2025న లక్నోలోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ ‘ది సెంట్రమ్’లో వీరి నిశ్చితార్థం జరిగింది.

Rinku Singh: టీమ్ ఇండియా క్రికెటర్ రింకూ సింగ్, రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. జూన్ 8, 2025న లక్నోలోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ ‘ది సెంట్రమ్’లో వీరి నిశ్చితార్థం జరిగింది.

ఈ గ్రాండ్ ఈవెంట్‌కు క్రికెట్, సినిమాలు, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భువనేశ్వర్ కుమార్, పియూష్ చావ్లా, ప్రవీణ్ కుమార్, యూపీ రంజీ కెప్టెన్ ఆర్యన్ జుయల్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

ప్రియా చేతికి తొడిగిన‌ ఉంగరం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా మారింది. కోల్‌కతా డిజైనర్ తయారు చేసిన రింగ్ కోసం రింకూ ప్రత్యేకంగా ముంబై నుంచి ఆర్డర్ పెట్టించాడు. దాని విలువ సుమారు రూ. 2.5 లక్షలు. ఇక ఈ ఎంగేజ్‌మెంట్‌లో ప్రియా, రింకూ ఇష్టాల‌కు అనుగుణంగా వంటకాలను సిద్ధం చేశారు.

బెంగాలీ రసగుల్లాలు, కాజు పనీర్ రోల్స్‌, పనీర్ టిక్కా, మటర్ మలై వంటి డిష్‌లు ఏర్పాటు చేశారు. ఇక ఈ వేడుకకు 300 మంది అతిథులకు మాత్రమే ప్రత్యేక బార్‌కోడ్ పాస్‌ల ద్వారా అనుమతి ఇచ్చారు. భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీసుల సమర్థ యాక్టివ్ టీములు సిద్ధంగా ఉన్నాయి.

రింకూ, ప్రియాల ల‌వ్ స్టోరీ

రింకూ, ప్రియా ఒక సంవత్సరం క్రితం ఒక మ్యూచువల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. మొదట స్నేహంగా మొదలైన అనుబంధం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరూ నవంబర్ 18, 2025న వారణాసిలో పెళ్లి చేసుకోనున్నారు.




ప్రియా సరోజ్ ఎవరు?

ప్రియా సరోజ్ 2024లో మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం భారతదేశపు అతి తక్కువ వయసున్న‌ ఎంపీ. ఢిల్లీ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీల్లో చదువుకుని, సుప్రీంకోర్టులో లాయర్‌గా కూడా పనిచేశారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ మూడుసార్లు ఎంపీగా పనిచేశారు.

ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ప్రియా నెట్ వర్త్ సుమారు రూ. 11.26 లక్షలు. ఇక రింకూ సింగ్ ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్ ఆడుతూ, టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కేవలం ఐపీఎల్ నుంచి సంవత్సరానికి రూ. 13 కోట్లు, BCCI నుంచి రూ.60–80 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ ద్వారా కూడా మంచి ఆదాయం పొందుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories