రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ

Cricketer Mohammed Shami Received Arjuna Award
x

రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ

Highlights

ఢిల్లీలో 2024-అర్జున అవార్డుల ప్రదానం

Shami Received Arjuna Award: జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు క్రీడాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. టీమిండియా స్టార్ క్రికెట‌ర్ మ‌హ్మద్ ష‌మీ అర్జున అవార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు భారత పేసర్ మహ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.

గత ఏడాదిలో ఐసీసీ వరల్డ్ కప్‌లో సంచలన బౌలింగ్ చేసిన ష‌మీ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి సిఫారసు చేసింది. ప్రపంచ కప్ ఫైనల్ వరకు భారత ప్రయాణం చేయడంలో అతను చేసిన కృషికి గాను భారత క్రికెట్ అత్యున్నత సంఘం అతనికి బహుమతి ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ష‌మీ పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories