Sachin Tendulkar : ఉచితంగా సచిన్ క్రికెట్ పాఠాలు .. ఎక్కడో తెలుసా..

Cricket Batting Tips by Sachin Tendulkar
x

సచిన్ టెండూల్కర్ (ఫోటో ట్విట్టర్ )

Highlights

బ్యాటింగ్ లో టిప్స్ సచిన్ టెండూల్కర్ నేర్పిస్తానంటే.. క్రికెట్ రానివారు కూడా సిద్ధమైపోతారనడంలో సందేహం లేదు.

Sachin Tendulkar : బ్యాటింగ్ లో టిప్స్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నేర్పిస్తానంటే..క్రికెట్ రానివారు కూడా సిద్ధమైపోతారనడంలో సందేహం లేదు. తాజాగా అలాంటి అవకాశమే క్రికెట్ లో రాణించాలనుకునే వారి కోసం ఎదురుచూస్తుంది. సచిన్ ఉచితంగా క్రికెట్ పాఠాలు, చిట్కాలు బోధించనున్నాడు. ఆన్‌లైన్ లో లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ తరగతులు నిర్వహించేందుకు అంతా రెడీ చేసుకున్నాడు. ఎక్కడ, ఎలా అని ఆసక్తిగా చూస్తున్నారా..

వివరాల్లోకెళితే..క్రికెట్ లెజెండ్ స‌చిన్ కొత్త అవ‌తార‌మెత్తాడు. ఎడ్యుకేష‌న్ టెక్ స్టార్ట‌ప్ అయిన అన్అకాడ‌మీలో పెట్టుబ‌డి పెట్టాడు. అలాగే దానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా మారాడు. ఇక నుంచి ఫ్రీగా క్రికెట్ పాఠాలు చెప్ప‌నున్నాడు. అన్అకాడమీలోకి లాగిన్ అయ్యి స‌చిన్ చెప్పే క్రికెట్ పాఠాలు, టిప్స్ ఎవ‌రైనా ఉచితంగా చూడోచ్చు. స‌చిన్ త‌న జీవిత పాఠాల‌ను పంచుకుంటాడ‌ని, లెర్న‌ర్స్‌కు కోచింగ్ ఇస్తాడ‌ని అన్అకాడ‌మీ కోఫౌండ‌ర్ గౌర‌వ్ ముంజాల్ తెలిపారు. స్పోర్ట్స్ లెర్నింగ్ కేట‌గిరీలో స‌చిన్ ద్వారా మ‌రింత లోతుగా క్రికెట్ పాఠాలు చెప్పించ‌డానికి ఈ స్టార్ట‌ప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

త‌న జీవిత పాఠాల‌ను లెర్నర్స్‌‌తో పంచుకోవాల‌ని.. తాను ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నట్లు ఈ సంద‌ర్భంగా స‌చిన్ తన మనసులోని మాటను వెల్లడించాడు. మంచి ప్లాట్ ఫాం కోసం ఎదురు చూస్తున్న తనకు ఇన్ని రోజులకు దొరికిందన్నారు. త‌న విజ‌న్, అన్అకాడ‌మీ మిష‌న్ ఒకేలా ఉండ‌టంతో ఇద్ద‌రం క‌లిసి ఈ ఆలోచ‌న చేసిన‌ట్లు మాస్ట‌ర్ పేర్కొన్నాడు. దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న వాళ్లేనా సరే నేర్చుకునేందుకు అన్అకాడ‌మీ ఓ వార‌ధిలాగా ఉపయోగపడుతుందని స‌చిన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇందులో ఇప్ప‌టికే దాదాపు 50 వేల మందికిపైగా టీచ‌ర్లు ఉన్నారు. నెల‌కు 100 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్‌తో ముందుకు సాగుతోంది. మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సచిన్ శిష్యుడుగా మారండి.


Show Full Article
Print Article
Next Story
More Stories