IPL2020: ఐపీఎల్‌పై క్లారిటీ.. ఇటలీ ఫెడరేషన్‌ లీగ్‌ తరహా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్..?

IPL2020:  ఐపీఎల్‌పై క్లారిటీ.. ఇటలీ ఫెడరేషన్‌ లీగ్‌ తరహా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్..?
x
Ipl 2020
Highlights

ఈ ఏడాది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ -13 నిర్వహణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దానిపై సందిగ్ధత నెలకొంటుంది. మొదట అనుకున్నషెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మార్చి 29 ప్రారంభం కానుంది.

ఈ ఏడాది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ -13 నిర్వహణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దానిపై సందిగ్ధత నెలకొంటుంది. మొదట అనుకున్నషెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మార్చి 29 ప్రారంభం కానుంది. అయితే అసలు ఐపీఎల్ జరుగుతుందా? లేదా అనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ సెగ ఐపీఎల్‌కు తాకడమే. చైనాలో పుట్టిన కరోనా భారత్ తో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా భారత్‌లో కూడా వ్యాపించింది.

కరోనా వైరస్ సోకిన కేసులు భారత్ లో 70పైగా నమోదైయ్యాయి. తాజా ఐపీఎల్ ఆడేందుకు వచ్చే విదేశీ క్రిడాకారులకు ఏప్రిల్‌ 15 వరకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ 15వరకు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ లో కనిపించే అవకావం లేదు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బీసీసీఐ సహా ఎన్‌ఎస్‌ఎఫ్ పలు సూచనలు చేసింది. వచ్చే నెల 15 వరకు మ్యాచ్ నిర్వహించే స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించొద్దని ఆదేశించింది.

గురువారం బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ... ' ఈనెల 14న ముంబైలో ఐపీఎల్‌ నిర్వహణపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. విదేశీ ఆటగాళ్లకు వాణిజ్య వీసాలు జారీ చేస్తారు. ఇక దీనికి సంబంధించిన ఏ విషయం అయినా శనివారం తెలియజేస్తాం. ఐపీఎల్‌ను వాయిదా వేస్తే.. ఏప్రిల్‌, మే తర్వాత విదేశీ ఆటగాళ్లు మన దేశానికి వచ్చే అవకాశం లేదు. అంతర్జాతీయ జట్లు అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లతో బీజీ కానున్నాయి. ఐపీఎల్‌ను కచ్చితంగా నిర్వహించాలంటే అభిమనులను స్టేడియంలోకి అనుమతించకుండా... ఆడించడమే సరైన మార్గమని అని ఆయన అన్నారు.

కరోనా కారణంగా ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా కొన్నిటోర్నీలు జరగుతున్నాయి. బంగ్లాదేశ్‌ పితామహుడు షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ 100వ జయంతి సందర్భంగా బంగ్లాదేశ్‌ ఘనంగా నిర్వహించాలనుకున్న ఆసియా XI, ప్రపంచ XI టీ20 మ్యాచులు కూడా వాయిదా పడ్డాయి. ఇక సినియర్ క్రికెటర్లు ఆడే రోడ్డు సేఫ‌్టీ వరల్డ్ సిరీస్ కూడా పలు అంక్షలు ఉన్నాయి. దాదాపు 60 మంది విదేశీ క్రికెటర్లు లేకపోవడంతో లీగ్‌ను వాయిదా వేసే అవకాశాలు. ఇప్పటీకే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు లీగ్‌ నిర్వహణకు మొగ్గు చూపని విషయం తెలిసిందే.

అయితే క్రికెట్ అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడమే టోర్నీ నిర్వహించడమే మంచిదని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్టు సమాచారం. గ్రౌండ్ కు వచ్చి వీక్షించే వారికి టికెట్ ధరలో వాటను ఫ్రాంచైజీ తీసుకుంటాయి. అయితే అభిమానులు లేకుండా ఆడితే నష్ట్రాన్ని భర్తీకి భీమా అవకాశం ఉంది. దీంతో ఖాళీ స్టేడియాల వల్ల నష్టమేమి ఉండదు. టోర్నీ పూర్తిగా రద్దు చేస్తే.. మ్యాచ్ ఆడకుండానే ఆటగాళ్లకు చెల్లింపులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం చేసే మాధ్యమాలకు, యాడ్స్ వంటి వాటీల్లో భారీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories