ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆవేదన.. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి అంటూ బెంగ

ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆవేదన.. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి అంటూ బెంగ
x
Australia Players (File Photo)
Highlights

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు ఏప్రిల్ నెల వ‌చ్చిందంటే చాలు పెళ్లిళ్ల సీజ‌న్ వ‌చ్చిన‌ట్టే. గత కొద్దీ రోజులుగా వాతావ‌ర‌ణం మారిపోయింది. దీంతో చ‌లిగాలులు పెరిపోతున్నాయి.

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు ఏప్రిల్ నెల వ‌చ్చిందంటే చాలు పెళ్లిళ్ల సీజ‌న్ వ‌చ్చిన‌ట్టే. గత కొద్దీ రోజులుగా వాతావ‌ర‌ణం మారిపోయింది. దీంతో చ‌లిగాలులు పెరిపోతున్నాయి. ఈ క్ర‌మంలో పెళ్లి చేసుకునేందుకు వారు ఆసక్తి చూపిస్తారు. కానీ వారి ఆశ‌లు అన్ని త‌ల‌కిందులైయ్యాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంతో ప్ర‌ణాళిక‌ల‌న్ని మారిపోయాయి. ఏప్రిల్‌లో పెళ్లికి చేసుకోవాల‌ని 8 మంది క్రికెటర్లు సిద్ధపడ్డారు అటూ జాతీయ జట్టుకు, బోర్డు కాంట్రాక్ట్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నవారు కావ‌డం గ‌మ‌నార్హం. వారిలో ఆడమ్‌ జంపా, ఆండ్రూ టై, స్వెప్సన్‌, డార్సీ షార్ట్, ఈ జాబితాలో ఉన్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం కరోనా కారణంగా ఆ దేశంలో కఠిన నిబంధనలు విధించింది. పెళ్లికి కూడా 5 మందికి మించి హాజరు కారాదు. వధూవరులతో పాటు 2 మాత్రమే సాక్షులు, పాస్టర్‌ మాత్రమే ఉండాలి. దాంతో వివాహం చేసుకోవాల‌నుకున్న వారంతా వాయిదాలు వేసుకుంటున్నారు. మరో ఇద్దరు సినీయ‌ర్ క్రికెటర్లు కమిన్స్, మ్యాక్స్‌వెల్‌ల పరిస్థితి భిన్నంగా ఉంది. వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థాలు జరుపుకోగా.. పెళ్లి తేదీలు నిర్ణయించుకోలేదు. కమిన్స్‌ పరిస్థితి ఇబ్బందికరంగానే కనిపిస్తోంది.

కామిన్స్ వివాహం చేసుకోబేయే యువ‌తి బెకీ బోస్టన్‌ ఇంగ్లండ్‌కు చెందిన అమ్మాయి. కరోనా వల్ల ఇంగ్లండ్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్క‌డ వారి క్షేమ సమాచారం తెలుసుకోవడమే సరిపోతుందని, పెళ్లెలా జరుగుతుందని కమిన్స్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ 13 ర‌ద్ద‌యే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. దీంతో కమిన్స్‌ బాధ రెట్టింపయ్యేలా ఉంది. ఐపీఎల్‌ చరిత్రలోనే క‌మిన్స్ రూ. 15.5 కోట్లు అత్యధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఐపీఎల్ టోర్నీ జ‌ర‌గ‌క‌పోతే భారీ మొత్తం అతను కోల్పోయినట్లే అవుతోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories