సాండీ క్యాచ్‌కు..ఆశ్చర్యం వ్యక్తం చేసిన కివీస్ కెప్టెన్

సాండీ క్యాచ్‌కు..ఆశ్చర్యం వ్యక్తం చేసిన కివీస్ కెప్టెన్
x
Kane Williamson
Highlights

కరోనా వైరస్‌(కోవిడ్‌-19)మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. కరోనా అన్ని రంగాలు స్తంభించిపోయాయి.

కరోనా వైరస్‌(కోవిడ్‌-19)మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. కరోనా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. క్రీడా రంగంలోని క్రికెట్ తో సహా అన్ని క్రీడలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఒలంపిక్స్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో కోవీడ్ వ్యాప్తిని అరికట్టాలంటే ఇంటికే పరిమితం కావాలనే ప్రాథమిక సూత్రంతో అనేకమంది స్వీయ నిర్భంధం పాటిస్తున్నారు. మెల్లిమెల్లిగా న్యూజిలాండ్‌ దేశంలో విస్తరిస్తున్న కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా కివీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. అయితే కెన్ విలియమ్స్ ఖాళీ సమయంలో తన పెంపుడు కుక్క(సాండీ)తో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడిన వీడియోను విలియమ్సన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ఆ వీడియోలో కెన్ తన ఇంటి ఆవరణలో కుక్కతో పాటు మరొకరితో క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ చేస్తున్న కెన్ విలియమ్సన్‌ స్లిప్‌లో ఉన్న సాండీ వైపు ఆడాడు. అయితే స్లిప్‌లో సాండీ కళ్లు చెదిరే రీతిలో నోటితో క్యాచ్‌ అందుకుంది. ఈ కెన్ విలియమ్స్ ఆశ్చర్యానికి గురి చేసింది. సాండీ క్యాచ్‌ అందుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చే శాడు. దానికి ఓ క్యాప్షన్ ఇచ్చాడు. 'సాండీ స్లిప్‌లో ఉంది. ఉండే సాండీతో క్రికెట్‌ ఆడొచ్చు'అంటూ విలియమ్సన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories