ఖతార్‌ ఇంటర్నేషనల్‌ కప్‌: రికార్డు సృష్టించిన మీరాబాయి చాను

ఖతార్‌ ఇంటర్నేషనల్‌ కప్‌: రికార్డు సృష్టించిన మీరాబాయి చాను
x
Mirabai Chanu
Highlights

అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సత్తా‌చాటింది.

అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సత్తా‌చాటింది. ఖతార్‌‌లోని దోహా వేదికగా శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో మహిళల విభాగంలో 49 కేజీల మీరాబాయి చాను బరిలోకి దిగింది. మీరాబాయిచాను 194 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 2019 థాయ్‌లాండ్‌‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి 201 కేజీలు ఎత్తి రికార్డు నెలకొల్పింది.

చాను క్లీన్‌ అండ్‌ జర్క్‌లో వందపైగా కేజీల బరువు ఎత్తింది. మొదటి స్నాచ్‌లో ఆమె 83 కేజీల బరువు ఎత్తింది. రెండు మూడు స్థానాల్లో ఫ్రాన్స్‌కు చెందిన అనీస్ మిషెల్ , మానోన్‌ లొరెన్జ్‌ నిలిచారు. రెండో స్థానంలో అనీస్‌ మిషెల్‌ 172 కేజీల బరువు ఎత్తి రజత పతకం సాధించింది. 165 కేజీల బరువు ఎత్తి మానోన్‌ లొరెన్జ్‌ కాంస్యాం దక్కించుకున్నారు.

మీరాబాయి చాను ఒలింపిక్ క్వాలిఫయింగ్ సిల్వల్ లెవల్ పోటీల్లో సర్ణం సాధించింది. టోక్కో ఒలింపిక్స్‌కు 2020కు అర్హత సాధించాలంటే కీలకంగా మారింది. ఇక జెరేమీ లాల్‌రినుంగా వెన్స్ కేటగిరిలో 306 కేజీల బరువెత్తి రెండో స్థానం రజతం సొంతం చేసుకున్నాడు. 2019 సంవత్సరంలో ఒలింపిక్‌ ఈగట్‌ కప్ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ల్లో స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories