IPL 2020 : ఢిల్లీ క్యాపిటల్స్ షాక్.. హ్యాండిచ్చిన క్రిస్‌వోక్స్


మార్చి 29వ తేదీ నుంచి జరిగే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13కు సర్వం సిద్ధమవుతోంది. అయితే, ఈ సారి ఐపీఎల్‌కు విదేశీ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు....
మార్చి 29వ తేదీ నుంచి జరిగే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13కు సర్వం సిద్ధమవుతోంది. అయితే, ఈ సారి ఐపీఎల్‌కు విదేశీ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెటర్ కెప్టెన్ కేన్ విలియమ్స్‌న్ కరోనా వైరస్ కారణంగా ఈసారి ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాగాజా ఇంగ్లాండ్ పేసర్ క్రిస్‌వోక్స్ కూడా ఈ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్ 4వ తేదీ నుంచి ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టు సిరీసులు ఆడనుంది. శ్రీలంక, విండీస్‌తో మూడేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ తరపున ఆ టెస్టుల్లో రాణించేందుకు క్రిస్‌వోక్స్ ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కోల్‌కతాలో డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్రిస్‌వోక్స్‌ను 1.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరపున ఆడిన ఈ ఇంగ్లాండ్ పేసర్ 2017 ఐపీఎల్ 17 వికెట్లతో రాణించాడు. ఇక 2018లో ధారళంగా పరుగులివ్వడంతో అతడు 5 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. తాజాగా వోక్స్ నిష్క్రమణ ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, డిపెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఆ తర్వాత మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ XI పంజాబ్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఢిల్లీ తుది జట్టులో క్రిస్‌వోక్స్‌కు లేకపోవడం ఆ జట్టుకు మాత్రం ఇబ్బందే. టీమిండియా కీలక పేసర్ ఇషాంత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఐపీఎల్ టోర్నీ ఆరంభంలో ఇషాంత్ కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదనిపిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



