T10 Abu Dhabi : క్రిస్‌లిన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌..ఐపీఎల్‌లో విడిచిపెట్టిన కోల్‌కతా

T10 Abu Dhabi : క్రిస్‌లిన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌..ఐపీఎల్‌లో  విడిచిపెట్టిన కోల్‌కతా
x
Highlights

అబుదాబి వేదికగా టీ10 క్రికెట్ లిగ్ జరుగుతుంది. ఈ లిగ్‌లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ లో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా పలు జట్ల తరపున...

అబుదాబి వేదికగా టీ10 క్రికెట్ లిగ్ జరుగుతుంది. ఈ లిగ్‌లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ లో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా పలు జట్ల తరపున ఆడుతున్నారు. అయితే ఇటీవలె నిర్వహించిన ఐపీఎల్ వేలం పాటలో కొన్ని జట్లు కీలక ఆటగాళ్లను దూరం చేసింది. అందులో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ క్రిస్‌లిన్‌ని వేలంలో ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది.

కాగా.. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లిగ్‌లో ప్లేయర్ క్రిస్‌లిన్ మరాఠ అరేబియన్స్‌ జట్లు తరుపున ఆడుతున్నాడు. టీమ్ అబుదాబిపై జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌లిన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 7 సిక్సర్లుతో 91 పరుగులు చేశాడు. టీ10 లిగ్ లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు అలెక్స్ హేల్స్ 87 పరుగుల రికార్డ్‌ను క్రిస్‌లిన్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 138 చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ అబుదాబి లక్ష్య చేథనలో 114 పరుగులకే పరిమతమైంది. సూపర్ ఫామ్‌లో క్రిస్‌లిన్ ను ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ విడిచిపెట్టి పెద్ద తప్పేచేసిందనుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories