గేల్ విరోచిత బ్యాటింగ్.. 22 బంతుల్లో 84 పరుగులు

గేల్ విరోచిత బ్యాటింగ్..  22 బంతుల్లో 84 పరుగులు
x

 క్రిస్‌గేల్ 

Highlights

విండీస్ విద్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ మరోసారి తన పవర్ చూపించాడు.

విండీస్ విద్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ మరోసారి తన పవర్ చూపించాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో ప్రత్యర్థి జట్టు మరాఠా అరేబియన్స్‌కు చుక్కలు చూపించాడు. అబుదాబి తరఫున ఆడుతున్న గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బుధవారం రాత్రి మరాఠా అరేబియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థి మరాఠా అరేబియన్స్‌ నిర్దేశించిన 98 పరుగుల లక్ష్యాన్ని అబుదాబి 5.3 ఓవర్లలోనే ఛేదించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఓపెనర్‌ అలిషన్‌ షరాఫు(33; 23 బంతుల్లో 2x4, 3x6) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అబుదాబి జట్టును గేల్(84 నాటౌట్‌; 22 బంతుల్లో 6x4, 9x6) సూనాయాసంగా విజయం సాధించింది. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 84 పరుగుల్లో 78 పరుగులు బౌండరీల రూపంలోనే సాధించాడు గేల్.

Show Full Article
Print Article
Next Story
More Stories