IPL 2021 CSK vs RCB: ధోనీ వర్సెస్ కోహ్లీ బిగ్ ఫైట్.. రికార్డులివే

IPL 2021 CSK vs RCB: ధోనీ వర్సెస్ కోహ్లీ బిగ్ ఫైట్.. రికార్డులివే
x
Highlights

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు(ఆదివారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది.

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు(ఆదివారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. తాజా సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన బెంగళూరు.. నాల్గింటిలోనూ గెలుపొందింది. అపజయంలేని టీంగా మందుకు సాగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరుమీదుంది. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బెంగళూరు, రెండో స్థానంలో ఉన్న చెన్నై టీంల మధ్య మధ్య ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతోంది.

ఐపీఎల్ లో ముఖాముఖీ పోరు: ఇప్పటి వరకు బెంగళూరు, చెన్నై జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 16 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందగా.. 9 మ్యాచ్‌ల్లో బెంగళూరు టీమ్ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

టీలం బలాబలాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌

బెంగళూరు జట్టులో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఫామ్‌ లోకి రావడం జట్టు ఆనందంలో ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ కూడా ఆకట్టుకుంటున్నారు. ఇక షబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ విఫలమవుతున్నారు.

ఇక బౌలింగ్ పరంగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వరుసగా వికెట్లు తీస్తూ టీంకి అండగా ఉంటున్నాడు. హర్షల్ పటేల్ జెమీషన్, రిచర్డ్‌సన్ కూడా వికెట్లు తీస్తున్నారు. స్పిన్నర్ చాహల్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ అద్బుతంగా రాణిస్తున్నారు. దీంతో చెన్నై భారీ స్కోరుకి బాటలు వేస్తోంది. ఆ తర్వాత వస్తున్న మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్ ధోనీ, శామ్ కరన్ హిట్టింగ్‌ తో పరుగులు రాబడుతున్నారు. బ్యాటింగ్ పరంగా చెన్నై టీం బలంగా కనిపిస్తుంది.

బౌలింగ్ పరంగా దీపక్ చాహర్ వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. శామ్ కరన్, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శార్ధూల్ ఠాకూర్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. చెన్నై టీం కూడా బ్యాటింగ్, బౌలింగ్ లో సమతూకంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories