Top
logo

IPL 2021 RR– CSK: చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ వాయిదా!

Chennai super kings vs Rajasthan Match was Postponed
X
చెన్నై VS రాజస్థాన్ 
Highlights

IPL 2021 RR– CSK: రేపు ఢిల్లీలో సీఎస్‌కే-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడనున్నట్లు సమాచారం.

IPL 2021 RR– CSK: దేశ‌వ్యాప్తంగా క‌రో్నా రెండో ద‌శ వేగంగా వ్యాప్తి చెందుంది. ఈసారి క‌రోనా సెగ ఐపీఎల్ కు తాకింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ కొన‌సాగించ‌డం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు(బుధవారం) ఢిల్లీలో అరుణ్‌జైట్టీ స్టేడియంలో సీఎస్‌కే-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వాయిదా పడేలా అవకాశాలు కనబడుతున్నాయి. ఇంతవరకూ ఎటువంటి స్పష్టత లేకపోయినా సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడటమే కాకుండా మరో ఇద్దరికి ఆ వైరస్‌ సోకిం విషయం తెలిసిందే

ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ వాయిదా పడినట్లుగానే చెన్నై వర్సెస్ రాజస్థాన్ రేపటి మ్యాచ్ కూడా రీషెడ్యూల్‌ చేయక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై మంగళవారం సాయంత్రలోగా స్పష్టత రావొచ్చు. ఇప్పటికే బీసీసీఐ.. ఒకే వేదికలో మిగిలిన ఐపీఎల్‌ సీజన్‌ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

లీగ్ లోని మిగతా మ్యాచ్‌లు మొత్తం ముంబైలోని 3 స్టేడియాల్లో జరపాలని చూస్తోంది. దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే మే7వ తేదీ నుంచి ముంబైలోనే మ్యాచ్‌లు జరగుతాయి. అన్ని జట్లు ఒకే బయోబబుల్ లో ఉండి, వేర్వేరు నగరాలకు వెళ్లకుండా నియంత్రిస్తేనే కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనేది బీసీసీఐ ప్లాన్.

ఇదిలా వుండగా ప్రజల ఆరోగ్యాలను పక్కన పెట్టి ఐపీఎల్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో వెంటనే విచారణ చేపట్టాలని లాయర్ కరన్ సింగ్, సామాజిక కార్యకర్త ఇందర్ మోహన్ సింగ్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. కోర్టు వెంటనే జోక్యం చేసుకొని బీసీసీఐ, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)ను ఐపీఎల్ ఆపడానికి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

Web TitleIPL 2021 RR– CSK: Chennai super kings vs Rajasthan Match was Postponed
Next Story