IND vs WI : రెండో టీ 20 మ్యాచ్ లో భారత జట్టులో మార్పులు?

IND vs WI : రెండో టీ 20 మ్యాచ్ లో  భారత జట్టులో మార్పులు?
x
భారత్ - వెస్టిండిస్
Highlights

భారత్ - వెస్టిండిస్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి కేరళలోని తిరువనంతపురం వేదికగా రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.

భారత్ - వెస్టిండిస్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి కేరళలోని తిరువనంతపురం వేదికగా రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉప్పల్ మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగంలో పర్వాలేదు అనిపించినా భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీనిపైన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ కూడా స్పందించాడు.

మొదటి మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ నాలుగు ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. దీనితో అతని స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక తొలి టీ20లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇటు బౌలింగ్ లోను, అటు ఫీల్డింగ్ లోను పూర్తిగా నిరాశపరిచాడు. దీనితో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌‌ని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.మ్యాచ్ కేరళలో జరుగుతుంది కాబట్టి సంజు శాంసన్కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ అతన్ని తీసుకుంటే రిషబ్ పంత్ లేదా శివమ్ దూబేపై వేటు పడడం మాత్రం ఖాయం..

ఇక మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భారత్ ఇప్పటికే ఓ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ముందుంది. ఇక ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ని సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇక ఉప్పల్ మ్యాచ్ లో ఎదురైనా పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని విండిస్ జట్టు భావిస్తుంది. మొత్తానికి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది .

రెండో టీ20కి భారత్ తుది జట్టు అంచనా ఇలా ఉంది.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, చాహల్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories