Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని లాభాలు టీం ఇండియాకే

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని లాభాలు టీం ఇండియాకే
x

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని లాభాలు టీం ఇండియాకే

Highlights

Champions Trophy: ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన జట్లు తమ మ్యాచ్‌లను లాహోర్, కరాచీ, రావల్పిండి, దుబాయ్ స్టేడియాలలో ఆడుతున్నాయి.

Champions Trophy: ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన జట్లు తమ మ్యాచ్‌లను లాహోర్, కరాచీ, రావల్పిండి, దుబాయ్ స్టేడియాలలో ఆడుతున్నాయి. టీం ఇండియా దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే అన్ని మ్యాచ్ లను ఆడుతుంది. ఇక్కడ భారత జట్టు పొందుతున్న ఈ ప్రయోజనం గురించి ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో చర్చ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రకటన తర్వాత ఈ చర్చ మరింత హీటెక్కింది. అయితే, గాయం కారణంగా కమిన్స్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు. కానీ ఇప్పటికీ అతను తన జట్టు గురించి ఆందోళనగా ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో భవిష్యతులో టీం ఇండియాను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లను ఒకే మైదానంలో ఆడటం టీమ్ ఇండియాకు లాభం చేకూరుస్తుందని పాట్ కమ్మిన్స్ అన్నారు. భారత జట్టు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఉందని ఆయన అన్నారు. ఇది కాకుండా, వారు ఒకే మైదానంలో ఆడే ప్రయోజనాన్ని కూడా పొందారన్నారు.

టీం ఇండియా గ్రూప్ దశలో తన మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకుని సెమీ-ఫైనల్స్‌లో తన స్థానాన్ని బుక్ చేసుకుంది. భారత జట్టు దుబాయ్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు అది మార్చి 2న న్యూజిలాండ్‌తో తన మూడవ మ్యాచ్ ఆడాలి . అది కూడా దుబాయ్‌లో జరుగుతుంది.

ఒకే మైదానంలో మ్యాచ్‌లు ఆడటం వల్ల టీం ఇండియాకు లభించే ప్రయోజనం ఏంటంటే వారు ఎక్కువగా ప్రయాణించాల్సిన అవసరం లేదు. దీంతో వాళ్లు స్ట్రెయిన్ కావాల్సిన పనిలేదని మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్లు మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్ అన్నారు.

అంతే కాకుండా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో ఖచ్చితంగా తెలిసిన ఏకైక జట్టు టీమ్ ఇండియా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇతర జట్ల విషయంలో ఇలా జరుగడం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories